Sundeep Kishan Michael Gets a Release Date in February - Sakshi
Sakshi News home page

Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ తొలి పాన్‌ ఇండియా సినిమా 'మైఖేల్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Tue, Jan 3 2023 1:57 PM | Last Updated on Tue, Jan 3 2023 3:00 PM

Sundeep Kishan Michael Gets Release Date In February - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్‌. రంజిత్ జేయకొడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో తొలిసారి పాన్‌ ఇండియా స్థాయిలో తెరెకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ సేతపతి, గౌతమ్‌ మీనన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌  వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఫిబ్రవరి 3న దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.మైఖేల్ సినిమాలో సందీప్‌కిష‌న్‌కు జోడీగా మ‌జిలీ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement