చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి దీప్శిక హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ఆమె రీసెంట్‌గా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో తను నటించిన అనేక సన్నివేశాలను తొలగించారని ఆమె విచారం వ్యక్తం చేసింది.
చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
‘నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది నేను చేయాల్సింది కాదు. ఈ మూవీ కోసం మొదట మరో నటి నటించాల్సి ఉంది. కానీ ఆమె చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ అవకాశం నాకు వచ్చింది. దర్శకుడు రంజిత్ జయకొడి నాకు ఒక్కలైన్ స్టోరీనే చెప్పారు. నాకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఈ మూవీ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచనకు లేకుండా నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో విజయ్ సేతుపతికి, నాకు మధ్య అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ, మూవీ లెంగ్త్‌ను దృష్టిలో ఉంచుకుని వాటిని తొలగించారు. ఇది చాలా బాధ కలిగించింది’ అని ఆమె చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment