సందీప్‌ కిషన్‌ 'మైఖేల్‌' ఫస్ట్‌లుక్‌ చూశారా? | Sandeep Kishan Michael First Look Poster Released | Sakshi
Sakshi News home page

HBD Sandeep Kishan: సందీప్‌ కిషన్‌ 'మైఖేల్‌' ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది..

Published Sat, May 7 2022 11:14 AM | Last Updated on Sat, May 7 2022 11:45 AM

Sandeep Kishan Michael First Look Poster Released - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్‌. రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమాలో విజయ్‌ సేతపతి, గౌతమ్‌ మీనన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా శనివారం(మే7)న సందీప్‌ కిషన్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌  పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సిక్స్‌ప్యాక్‌ బాడీతో చేతిలో గన్‌ పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిస్తున్నాడు.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. సందీప్‌ సరసన దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్‌లు ముఖ్య పాత్రల్లో  కనిపించనున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement