పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా నటిగా తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి దీప్శిక. తాజాగా మైఖెల్ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరింంది. సందీప్ కిషన్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రధాని పాత్ర పోషించారు. నటి దివ్యాంశ కౌశిక్ కథానాయకిగా నటించిన ఈ సినిమాలో దీప్శిక కీలక పాత్రలో నటించారు. రంజిత్ జయక్కొడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింబడుతోంది.
ఈ సందర్భంగా నటి దీప్శిక తన ఆనందాన్ని పంచుకుంటూ చెన్నైలో పుట్టి పెరిగి చదువుకున్న తాను తమిళ చిత్రాల్లో నటిస్తుండగానే తెలుగులో అవకాశం వచ్చిందని తెలిపింది. అలా ఇప్పుడు అక్కడ అరడజను చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తాను పోషింన జెనీఫర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఇందుకు దర్శకుడు రంజిత్ జయక్కొడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. నిజానికి ఈ పాత్రను వేరే ప్రముఖ నటి చేయాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె వైదొలగడంతో దర్శకుడు తనకు అవకాశం కల్పించారని చెప్పారు.
ఇందులో గౌతమ్ మీనన్ సరసన నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నానని దానికి సంబంధింన వివరాలు త్వరలోనే వెలువడతాయని చెప్పారు. అదేవిధంగా తెలుగులో ఉద్వేగం అనే చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాను నటించిన రమణ కల్యాణం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని ఇది తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందినట్లు చెప్పారు. అదేవిధంగా తెలుగులో నటుడు రవితేజ నిర్మిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు దీప్శిక వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment