deepshikha
-
ఆయనతో చేసిన చాలా సీన్స్ తొలగించారు, బాధగా అనిపించింది: మైఖేల్ హీరోయిన్
చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి దీప్శిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ఆమె రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో తను నటించిన అనేక సన్నివేశాలను తొలగించారని ఆమె విచారం వ్యక్తం చేసింది. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం ‘నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది నేను చేయాల్సింది కాదు. ఈ మూవీ కోసం మొదట మరో నటి నటించాల్సి ఉంది. కానీ ఆమె చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ అవకాశం నాకు వచ్చింది. దర్శకుడు రంజిత్ జయకొడి నాకు ఒక్కలైన్ స్టోరీనే చెప్పారు. నాకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఈ మూవీ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచనకు లేకుండా నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో విజయ్ సేతుపతికి, నాకు మధ్య అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ, మూవీ లెంగ్త్‌ను దృష్టిలో ఉంచుకుని వాటిని తొలగించారు. ఇది చాలా బాధ కలిగించింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. -
ఆ హీరోయిన్ స్థానంలో నాకు చాన్స్ వచ్చింది : 'మైఖేల్' నటి
పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా నటిగా తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి దీప్శిక. తాజాగా మైఖెల్ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరింంది. సందీప్ కిషన్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రధాని పాత్ర పోషించారు. నటి దివ్యాంశ కౌశిక్ కథానాయకిగా నటించిన ఈ సినిమాలో దీప్శిక కీలక పాత్రలో నటించారు. రంజిత్ జయక్కొడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింబడుతోంది. ఈ సందర్భంగా నటి దీప్శిక తన ఆనందాన్ని పంచుకుంటూ చెన్నైలో పుట్టి పెరిగి చదువుకున్న తాను తమిళ చిత్రాల్లో నటిస్తుండగానే తెలుగులో అవకాశం వచ్చిందని తెలిపింది. అలా ఇప్పుడు అక్కడ అరడజను చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తాను పోషింన జెనీఫర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఇందుకు దర్శకుడు రంజిత్ జయక్కొడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. నిజానికి ఈ పాత్రను వేరే ప్రముఖ నటి చేయాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె వైదొలగడంతో దర్శకుడు తనకు అవకాశం కల్పించారని చెప్పారు. ఇందులో గౌతమ్ మీనన్ సరసన నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నానని దానికి సంబంధింన వివరాలు త్వరలోనే వెలువడతాయని చెప్పారు. అదేవిధంగా తెలుగులో ఉద్వేగం అనే చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాను నటించిన రమణ కల్యాణం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని ఇది తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందినట్లు చెప్పారు. అదేవిధంగా తెలుగులో నటుడు రవితేజ నిర్మిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు దీప్శిక వెల్లడించారు. -
సింగిల్స్ చాంప్స్ దీప్షిక, జ్ఞాన దత్తు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్–10 బాలబాలికల విభాగాల్లో జ్ఞాన దత్తు, దీప్షిక విజేతలుగా నిలిచారు. అమీర్‌పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–10 బాలుర ఫైనల్లో టి.టి. జ్ఞాన దత్తు (సుచిత్ర అకాడమీ) 21–12, 21–10తో ఎస్.వి. మహేశ్ (కేన్స్ అకాడమీ)పై... అండర్–10 బాలికల ఫైనల్లో ఎన్. దీప్షిక (ఏఎస్ రావు అకాడమీ) 21–8, 21–10తో బి. హాసిన రెడ్డి (పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ)పై విజయం సాధించారు.