
హీరోయిన్లు త్రిష, సిమ్రాన్ అద్భుతమైన సాహసాలు చేస్తున్నారు. వెండితెరపై వారి సాహసాన్ని ఆడియన్స్ ఆస్వాదించడానికి చాలా సమయం ఉంది. సిమ్రాన్, త్రిష ప్రధాన పాత్రధారులుగా సుమంత్ రాధాకృష్ణన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సిమ్రాన్, త్రిషలపై కొన్ని సాహసోపేతమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ అడ్వంచరస్ మూవీకి ‘షుగర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. ఇందులో సిమ్రాన్, త్రిష అక్కాచెల్లెళ్ల పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది విడుదలైన రజనీకాంత్ ‘పేట’ చిత్రం తర్వాత సిమ్రాన్, త్రిష కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న చిత్రం ఇదే.