వెంకన్న సేవలో స్పీకర్, సిమ్రాన్ | Nadendla Manohar, simran worships at Tirupati temple | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో స్పీకర్, సిమ్రాన్

Published Tue, Feb 11 2014 12:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

వెంకన్న సేవలో స్పీకర్, సిమ్రాన్

వెంకన్న సేవలో స్పీకర్, సిమ్రాన్

తిరుమల : కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని మంగళవారం తెల్లవారుజామున శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీనటి సిమ్రాన్  దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రెండో కుమారుడి పుట్టు వెంట్రుకలు తీయిచేందుకు సిమ్రాన్ ...భర్త ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.

మరోవైపు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వెంకన్నను దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆయనకు టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండలంలో నాదెండ్లకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి, స్వామివారి ప్రసాదాలు అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement