సీనియర్స్‌తో శింబు స్టెప్పులా? | Simbu to dance alongside Meena and Simran? | Sakshi
Sakshi News home page

సీనియర్స్‌తో శింబు స్టెప్పులా?

Published Tue, Dec 2 2014 1:59 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

సీనియర్స్‌తో శింబు స్టెప్పులా? - Sakshi

సీనియర్స్‌తో శింబు స్టెప్పులా?

సంచలన నటుడు శింబు సీనియర్ నటీమణులు సిమ్రాన్, మీనాలతో పాటు ప్రఖ్యాత నటి షావుకారు జానకితో స్టెప్స్ వేయనున్నారని ఈ అరుదైన గీతం సన్నివేశాలు వాలు చిత్రంలో చోటు చేసుకోనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం వాలు. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్. వీరిద్దరూ ప్రేమించుకోవడం మొదలెట్టింది ఈ చిత్ర సమయంలోనే. ఆ తరువాత వీరి లవ్ బ్రేక్ అప్ అవ్వడంతో వాలు చిత్రం సమస్యల్లో పడింది. ఈ చిత్రం కోసం ఇంకా ఒక పాట చిత్రీకరించాల్సి ఉండగా హన్సిక కాల్‌షీట్స్ కేటాయించనని మొరాయించారు.
 
 ఈ పాటకు శింబు, సిమ్రాన్, మీన, షావుకారు జానకిలతో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి ఆ చిత్ర దర్శకుడు విజయ్ చందర్‌ను అడగ్గా అదంతా అసత్య ప్రచారం అని ఆయన కొట్టి పారేశారు. వాలు చిత్ర విషయాలను దర్శకుడు వివరిస్తూ ఒక పాటకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి వున్న విషయం నిజమేనన్నారు. అయితే ఇందులో నటించేది ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. త్వరలోనే ఆ నటి ఎంపిక ఉంటుందన్నారు. ఒక కీలక సన్నివేశంలో సిమ్రాన్, మీనా, షావుకారు జానకిలను నటింప చేయాలనే ఆలోచన ఉందని ఆ విషయం గురించి ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
 
 వాలు చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయాలని ఇంతకుముందు అనుకున్నా ఇప్పుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 3న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయని దర్శకుడు అన్నారు. నటుడు శింబు ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేస్తూ వాలు చిత్రం నిర్ణయించిన తేదీ ప్రకారం విడుదల కాకపోవడం తన అభిమానులకు నిరాశ కలిగించే విషయమేనన్నారు. చిత్ర షూటింగ్ సమయంలో తన సూచనలు, సలహాలు, సహకారాలు ఉంటాయి కానీ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ లాంటి వ్యాపారలావాదేవీల్లో తాను తలదూర్చనన్నారు. ఏదైమైనా ఫిబ్రవరి 3న వాలు చిత్రం విడుదల తరువాత ఇదు నమ్మ ఆళు చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి వస్తుందని శింబు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement