Captain OTT Streaming: Arya Captain Movie Premiere on ZEE5 - Sakshi
Sakshi News home page

Captain OTT Streaming: 3 వారాలకే ఓటీటీకి కెప్టెన్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Published Thu, Sep 22 2022 9:08 PM | Last Updated on Thu, Sep 22 2022 9:24 PM

Captain OTT Streaming: Arya Captain Movie Premiere on ZEE5 - Sakshi

తమిళ హీరో ఆర్య హీరోగా ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్‌’. శక్తి సౌందన్‌ రాజన్‌ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 8న తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదలైంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత టి. కిషోర్ తో కలిసి ఆర్య కూడా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైంది.

చదవంండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్‌.. నటుడు ప్రభాకర్‌ షాకింగ్‌ రియాక్షన్‌

విడుదలైన మూడు వారాలకే కెప్టెన్‌ ఓటీటీకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ‘జీ5’లో కెప్టెన్‌ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. తాజా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ సమర్పించిన ఈ చిత్రానికి ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించగా... సీనియర్‌ నటి సిమ్రాన్‌ మహిళా ఆర్మీ అధికారినిగా స్పెషల్‌ రోల్‌ పోషించింది. 

చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. హీరోయిన్‌ గురించి ఏమన్నదంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement