
రజనీకాంత్
కామ్‌గా క్లాస్‌లు చెప్పేవాడు అనుకొని తక్కువ అంచనా వేశారు ప్రొఫెసర్ రజనీకాంత్‌ని. కానీ అతని ఫ్లాష్‌బ్యాక్ తెలియక తన్నులు తిన్నారు రౌడీ గ్యాంగ్. ఇదంతా రజనీకాంత్ లేటెస్ట్ సినిమా షూటింగ్ విశేషాలే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ కథానాయికలు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసింది చిత్రబృందం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ ఫైట్ సీన్‌ను కొరియోగ్రఫీ చేశారు. ఇందులో రజనీకాంత్ ఫ్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని, ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్‌లో డాన్‌లా కనిపిస్తారని సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, మేఘా ఆకాశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరు«ద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment