యువహీరోతో సీనియర్ తారల హంగామా! | Simbu's 'Vaalu' to Release Next Year | Sakshi
Sakshi News home page

యువహీరోతో సీనియర్ తారల హంగామా!

Published Fri, Dec 12 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

యువహీరోతో సీనియర్ తారల హంగామా!

యువహీరోతో సీనియర్ తారల హంగామా!

బి. సరోజాదేవి... 1950, 60లలో తిరుగు లేని తార. ఖుష్బూ, సిమ్రాన్... 1990, 2000లలో హవా నడిపించిన తారలు. ఈ ముగ్గురూ కలిసి ఒక పాటలో కనిపిస్తే.. చూడటానికి కనువిందుగా ఉంటుంది. అందుకు వేదిక కానుంది తమిళ చిత్రం ‘వాలు’. శింబు, హన్సిక జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఓ పాట మినహా పూర్తయ్యింది. త్వరలో ఆ పాటను చిత్రీకరించనున్నారు.
 
ఈ పాటలోనే ఈ ముగ్గురు తారలూ కనిపించనున్నారు. ఇందులో దివంగత నటుడు ఎమ్జీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో అజిత్.. గెటప్స్‌లో శింబు కనిపిస్తారట. ఎమ్జీఆర్ గెటప్ సీక్వెన్స్‌లో ఈ యువహీరోతో కలిసి సరోజా దేవి కాలు కదుపుతారు.

రజనీకాంత్ వేషానికి ఖుష్బూ జతకడతారు. అజిత్‌లా మారినప్పుడు సిమ్రాన్ కాలు కదుపుతారట. మూడు తరాలకు చెందిన ముగ్గురు నాయికలతో శింబు డాన్స్ చేయడం అంటే ఆసక్తిగానే ఉంటుంది. ఆ విధంగా ఈ పాట ‘వాలు’కి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెప్పొచ్చు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement