నా ఫేవరెట్ ఎవరంటే... | HANSIKA IS PROMISING ACTRESS : SIMRAN | Sakshi
Sakshi News home page

నా ఫేవరెట్ ఎవరంటే...

Published Tue, Dec 31 2013 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

నా ఫేవరెట్ ఎవరంటే...

నా ఫేవరెట్ ఎవరంటే...

 ప్రస్తుతం ప్రామిసింగ్ నటి హన్సికేనంటున్నారు ఒక నాటి అందాల నటి సిమ్రాన్. నటి హన్సికపై ఎందువల్లనో సిమ్రాన్ ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారు. ఇంతకు ముందు కూడా శింబు ప్రేమ విషయంలో జాగ్రత్త వహించాలని ఈమె హన్సికకు హిత బోధ చేశారు. సిమ్రాన్ బహుభాషా నటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్‌గా మంచి లైమ్‌లైట్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. 
 
 కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉన్న ఈ సుందరి ఆ తరువాత అడపాదడపా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లోనూ దర్శనమిస్తున్న సిమ్రాన్‌ను వెండి తెరపై బాగా కనుమరుగైపోయారేమిటని ప్రశ్నించగా ప్రస్తుతం తన సమయం అంతా తన కొడుకులు అదీప్ ఒడో (8), ఆదిత్ వీర్ (2)ల సంరక్షణకే కేటాయిస్తున్నట్లు చెప్పారు. మాతృత్వం అనేది స్త్రీకి మధురమైన ఘట్టంగా పేర్కొన్నారు. ఆ సమయంలో తల్లి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో తాను వంద శాతం ఒక గృహిణిగా, కన్నతల్లిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. 
 
 తాను నటిగా కొనసాగినప్పుడు వృత్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిపారు. తాను సినిమాకు విరామం మాత్రమే ప్రకటించానని పూర్తిగా దూరం కాలేదని చెప్పారు. ఇప్పటికి పలువురు దర్శక నిర్మాతలు నటించమని అడుగుతున్నారని వివరించారు. త్వరలోనే సరికొత్త ప్రణాళికలో ప్రేక్షకుల ముందుకొస్తానని తెలిపారు. ప్రస్తుతం మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు వ్యక్తిగతంగా నటి హన్సిక అంటే చాలా ఇష్టం అన్నారు. ప్రస్తుతం ప్రామిసింగ్ నటి కూడా ఆమేనని పేర్కొన్నారు. చక్కని అందం, అభినయంతోపాటు క్రమశిక్షణ గల నటి హన్సిక అని సిమ్రాన్ కితాబిచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement