సిమ్రాన్ వస్తోందోచ్! | Film industry has changed a lot: Simran | Sakshi
Sakshi News home page

సిమ్రాన్ వస్తోందోచ్!

Published Thu, Oct 29 2015 10:39 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

సిమ్రాన్ వస్తోందోచ్!

సిమ్రాన్ వస్తోందోచ్!

సిమ్రాన్... ఈ పేరు చెప్పగానే, పెళ్ళయి, సినిమాలకు దూరమయ్యే ముందు దాకా తెలుగు, తమిళ భాషలను దున్నేసిన గ్లామర్ హీరోయిన్ గుర్తుకొస్తుంది. దీపక్‌తో పెళ్ళి, ఆ పైన పిల్లలతో సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల భామ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. కాకపోతే, ఈ సారి నటిగానే కాదు... నిర్మాతగా కూడా! ‘సిమ్రాన్ అండ్ సన్స్’ అనే పేరుతో నిర్మాణసంస్థ పెట్టిన ఆమె తొలి ప్రయత్నంగా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా తీయనునట్లు కోడంబాకమ్ కబురు. ఒకటి రెండు నెలల్లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాతో యాడ్ ఫిల్మ్స్ తీసే గౌరీశంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారట.

ఈ విషయం గురించి వివరాలు అడిగినప్పుడు సిమ్రాన్ నెమ్మదిగా గొంతు విప్పారు. ‘‘చిత్ర నిర్మాణ సంస్థ పెడుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి బోలెడన్ని స్క్రిప్ట్స్ విన్నాం. గౌరీశంకర్ చెప్పిన సైన్స్ ఫిక్షన్ కథాంశం నచ్చి, ఓ.కె. చెప్పాం. కథ, కథన విధానం కొత్తగా ఉంటాయి’’అన్నారు. అన్నట్లు ఈ సినిమాలో సిమ్రాన్ ఒక గూఢచారి తరహా పాత్ర పోషిస్తారట. ఆమె పాత్రకు మంచి యాక్షన్‌తో పాటు, యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయట. ఇంకేం... మంచి కథతో పాటు నిర్మాతగా, నటిగా కొత్త రోల్‌తో సిమ్రాన్ రీ-ఎంట్రీ ఇస్తారన్న మాట! తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొన్నేళ్ళు వెలిగిన సిమ్రాన్ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమ వైపు కూడా దృష్టి సారిస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement