Gaurishankar
-
వేడుకలా పుస్తక ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ అనగానే పుస్తకాల పండుగ గుర్తొస్తుంది. కవులు, కళాకారులు, రచయితల సందడి కన్పిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా అరుదైన నవలలు, ప్రముఖల జీవితగాథలు, చారిత్రక పోరాటాలు, కథలు, ట్రావెలాగ్స్, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలన్నీ ఒకే చోట దర్శనమిస్తాయి. రాజధాని నలుమూలల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల పాఠక ప్రియులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో పాఠకులు వస్తారని మా అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది’అని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే! సాక్షి ప్రతినిధి: హైదరాబాద్ బుక్ ఫెయిర్ విశిష్టత ఏమిటీ? జూలూరి: దేశంలోనే అతి ప్రాచీనమైన బుక్‌ఫెయిర్ ఇదే. దీనికంటూ ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. సంస్కృతి, సాహిత్యం, సాహిత్య వేత్తలకు సంబంధించిన సేవలను నెమరువేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఈ నేలమీద పుట్టిన రచయితలకు, వారి రచనలకు ఓ వేదిక కల్పిస్తుంది. భిన్న జాతులు, మతాలు, కులాలు, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ప్రజలు జీవిస్తున్నారు. వారి ఆలోచనలకు, అభిరుచికి తగిన పుస్తకాలు అందుబాటులోకి తెచ్చి వారిలో పఠనాసక్తిని పెంచుతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైంది? 1985లో మొదటగా చిక్కడపల్లిలోని నగరకేంద్ర గ్రంథాలయంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. స్థలాభావంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ థియేటర్ వద్దకు మార్చాం. ఆ తర్వాత కేశవ్‌మెమోరియల్ గ్రౌండ్స్, ఎగ్జిబిషన్ మైదానం, నిజాం కళాశాల, పీపుల్స్‌ప్లాజా, ఆ తర్వాత తెలంగాణ కళాభారతిని (ఎన్టీఆర్ స్టేడియాన్ని) పుస్తక ప్రదర్శనకు వేదికగా మార్చాం. తొలి రోజుల్లో 50 స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రస్తుతం 320 స్టాల్స్‌కు చేరుకుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలే కాదు.. వంటలు, బ్యూటీ టిప్స్ బుక్స్, భక్తి, ముక్తి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి. మారుతున్న కాలంలో పుస్తకాలకున్న ప్రాధాన్యం ఏంటి? ఇంటర్నెట్, యూట్యూబ్, స్మార్ట్ఫోన్లు, టీవీలు వచ్చాక పుస్తక పఠనం తగ్గిన మాట వాస్తవమే. టెక్నాలజీ ఎంత వచ్చినా పుస్తకాల అమ్మకాలు మాత్రం తగ్గలేదు. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ సాహిత్యం, చరిత్ర పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. పీడీఎఫ్, ఈ–బుక్ కాపీలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మరీ చదువుతున్నారు. బుక్‌ఫెయిర్‌కు లక్షల్లో తరలివస్తున్న పాఠకులే ఇందుకు నిదర్శనం. తెలుగు సాహిత్య విమర్శ ఏ స్థితిలో ఉంది? విమర్శ అసలు లేదని కాదు. అది చేయాల్సినంత పని చేయట్లేదన్నది వాస్తవం. విమర్శ సాహిత్యంలోని విలువలను విశ్లేషించి చూపాలి. సమర్థనకో, విస్మృతికో గురిచేయడం సరికాదు. కవిత్వం, కథ వచ్చినంతగా, నవల, విమర్శ రావట్లేదు. కవుల సంఖ్య పెరిగినంతగా విమర్శకుల సంఖ్య పెరగట్లేదు. ఉన్నవాళ్లలో కూడా లోతైన అధ్యయనంతో నిలబడే విమర్శకులను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. యూనివర్సిటీ విద్యార్థుల రూపంలో విమర్శకు కావాల్సిన ముడి సరుకు ఉంది. -
సిమ్రాన్ వస్తోందోచ్!
సిమ్రాన్... ఈ పేరు చెప్పగానే, పెళ్ళయి, సినిమాలకు దూరమయ్యే ముందు దాకా తెలుగు, తమిళ భాషలను దున్నేసిన గ్లామర్ హీరోయిన్ గుర్తుకొస్తుంది. దీపక్‌తో పెళ్ళి, ఆ పైన పిల్లలతో సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల భామ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. కాకపోతే, ఈ సారి నటిగానే కాదు... నిర్మాతగా కూడా! ‘సిమ్రాన్ అండ్ సన్స్’ అనే పేరుతో నిర్మాణసంస్థ పెట్టిన ఆమె తొలి ప్రయత్నంగా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా తీయనునట్లు కోడంబాకమ్ కబురు. ఒకటి రెండు నెలల్లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాతో యాడ్ ఫిల్మ్స్ తీసే గౌరీశంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారట. ఈ విషయం గురించి వివరాలు అడిగినప్పుడు సిమ్రాన్ నెమ్మదిగా గొంతు విప్పారు. ‘‘చిత్ర నిర్మాణ సంస్థ పెడుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి బోలెడన్ని స్క్రిప్ట్స్ విన్నాం. గౌరీశంకర్ చెప్పిన సైన్స్ ఫిక్షన్ కథాంశం నచ్చి, ఓ.కె. చెప్పాం. కథ, కథన విధానం కొత్తగా ఉంటాయి’’అన్నారు. అన్నట్లు ఈ సినిమాలో సిమ్రాన్ ఒక గూఢచారి తరహా పాత్ర పోషిస్తారట. ఆమె పాత్రకు మంచి యాక్షన్‌తో పాటు, యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయట. ఇంకేం... మంచి కథతో పాటు నిర్మాతగా, నటిగా కొత్త రోల్‌తో సిమ్రాన్ రీ-ఎంట్రీ ఇస్తారన్న మాట! తెలుగులో టాప్ హీరోయిన్గా కొన్నేళ్ళు వెలిగిన సిమ్రాన్ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమ వైపు కూడా దృష్టి సారిస్తారేమో చూడాలి. -
ఇంద్రకీలాద్రిపై టెన్షన్ టెన్షన్
విజయవాడ : మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు దుర్గగుడి ఘాట్‌రోడ్డుపై గురువారం బీభత్సం సృష్టించాడు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు తనను అనుమతించలేదంటూ ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద కొండ శిఖరానికి ఎక్కి దూకేస్తానంటూ బెదిరించాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని కిందకు దింపడంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని కొమరాడకు చెందిన అంపిరి గౌరీశంకర్ (26) గురువారం దుర్గమ్మ దర్శనానికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న గౌరీశంకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది క్యూలైన్లోకి అనుమతించలేదు. దీంతో గౌరీశంకర్ ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద నుంచి కొండ శిఖరానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి కేకలు వేయడంతో భక్తులు గమనించి ఆలయ ప్రాంగణంలోని పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ అధికారి బి.శ్రీనివాసరావు నేతృత్వంలోని సిబ్బంది వి.శివనాగిరెడ్డి, వి.శ్రీనివాసరావు, పి.శివకృష్ణ కొండ ఎక్కి గౌరీశంకర్‌కు కిందకు దింపే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గౌరీశంకర్ తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగగా, బుజ్జగించి కిందకు దింపారు. అయితే, గౌరీశంకర్ మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బాధిత రైతులను ఆదుకుంటాం
చీపురుపల్లి రూరల్/భోగాపురం, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర బృందం సభ్యు డు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డెరైక్టర్ పి.గౌరీశంకర్ భరోసా ఇచ్చా రు. గత నెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మంగళవారం సాయంత్రం కేంద్ర బృందం చీపురుపల్లి మండలం జి.ములగాం, కరకాం గ్రామాల్లో పర్యటించింది. పాడైన పత్తి, బొప్పారుు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని, 30 ఏళ్లు వ్యవసాయం కూడా చేసినందున రైతు కష్టం తెలుసునని చెప్పారు. రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా పంట నష్టం క్షేత్రస్థాయిలో నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాన్ని నియమించిందన్నారు. బృందంలో తనతో పాటు సీఈఎస్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, డ్రింకింగ్ వాటర్ అండ్ క్వాలిటీ కంట్రోలర్ వి.కె.భట్ ఉన్నారని చెప్పారు. అంతకుముందు ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ 50 శాతానికి పైగా నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామని పెట్టిన నిబంధన కారణంగా చాలా మంది రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. హెక్టారును ఒక యూనిట్‌గా చేసి నష్టాన్ని అంచనా వేసేలా నివేదిక అందజేయాలని కోరారు. మండలంలో నాలుగు వందల హెక్టార్లలో బొప్పాయి పంట పాడైనా నేటికీ పరిహారం అందలేదని జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ బొత్స ఝాన్సీ, జేడీ లీలావతి మాట్లాడుతూ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 16,936 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. 4124 హక్టార్లలో వరి, 2641హెక్టార్లలో మొక్కజొన్న, 9025 హెక్టార్లలో పత్తి, 79 హెక్టార్లలో చెరుకు, 420 హెక్టార్లలో పెసర, 355 హెక్టార్లలో మినప, 140 హెక్టార్లలో కొర్రా, 51 హెక్టార్లలో చోడి, 233 హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. అనంతరం ములగాంలో వర్ష బీభత్సానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను బృందం పరిశీలించింది. అంతకుముందు కేంద్ర బృందం భోగాపురం మండలం రావాడ గ్రామంలో పర్యటించింది. అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శనను సభ్యులు పరిశీలించారు. కల్వర్టులు, రోడ్లు కోతకు గురైన విషయూన్ని ఎంపీ ఝాన్సీ కేంద్ర బృందానికి వివరించారు. ఇళ్లను ప్రభుత్వమే నిర్మించాలని ఎస్సీ కాలనీవాసులు ఎంపీ వద్ద మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ పి.శోభ, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయ జేడీ లక్ష్మణదాస్, స్టేట్ కన్సల్టెంట్ ఎన్డీఆర్.శర్మ, మండల ప్రత్యేకాధికారి పి.బాంధవరావు, చీపురుపల్లి తహశీల్దార్ టి.రామకృష్ణ, ఎంపీడీఓ కె.రాజ్‌కుమార్, ఏడీఏ ఆర్.శ్రీనివాసరావు, ఏఓ ఎస్.రవీంద్రనాద్, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, భోగాపురం తహశీల్దార్ రాజకుమారి, ఎంపీడీఓ ఎన్.సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ, సర్పంచ్ నిడిగొట్టు పైడినాయుడు, దంతులూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.