నాలుగో భార్యనూ వదిలేశాడు.. | The young man left his wife | Sakshi
Sakshi News home page

నాలుగో భార్యనూ వదిలేశాడు..

Published Thu, Apr 14 2016 6:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

The young man left his wife

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి మూడు నెలలు తిరగకుండానే నాలుగో భార్యను కూడా వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో నివసించే సిమ్రాన్ (19) వివాహం గత ఏడాది నవంబర్ 13వ తేదీన సయ్యద్ యాసర్ అహ్మద్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ.30 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. అయితే, వివాహమైన కొద్ది రోజుల నుంచే ఆమె అత్త వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త దంపతులు వేరు కాపురం పెట్టారు.

 

అయినాసరే అత్త ఆగడాలు ఆపక పోగా పుట్టింటికి భర్తతో చేరుకుంది. తన భర్త పెళ్ళికి ముందు ఆభరణాల వ్యాపారమని చెప్పి నమ్మించాడు. తీరా చూస్తే ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉంటుండటంతో పలుమార్లు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఇప్పటికే అతడు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్నట్లు తెలిసింది. పెద్దలతో పంచాయితీ పెట్టినా ఫలితం కనిపించలేదు. తనను నాలుగో వివాహం చేసుకొని మూడు నెలలు తిరగకుండానే పరారైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నిందితుడు కుటుంబసభ్యులతోపాటు పరారైనట్లు సమాచారం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement