సిమ్రాన్‌ వర్సెస్‌ సమంత! | Shiva Karthikeyan, Simran villain in Samantha's film | Sakshi

సిమ్రాన్‌ వర్సెస్‌ సమంత!

Jun 22 2017 2:06 AM | Updated on Sep 5 2017 2:08 PM

సిమ్రాన్‌ వర్సెస్‌ సమంత!

సిమ్రాన్‌ వర్సెస్‌ సమంత!

సిమ్రాన్‌ను చూస్తే చాలు సమంతకు చిర్రెత్తుకొస్తుందట. సిమ్రాన్‌ కూడా సమంతను ఎలా దెబ్బతీయాలని ప్లాన్‌ చేస్తుంటే తమిళ్‌ హీరో శివకార్తీకేయన్‌ అడ్డుపడుతుంటారట.

సిమ్రాన్‌ను చూస్తే చాలు సమంతకు చిర్రెత్తుకొస్తుందట. సిమ్రాన్‌ కూడా సమంతను ఎలా దెబ్బతీయాలని ప్లాన్‌ చేస్తుంటే తమిళ్‌ హీరో శివకార్తీకేయన్‌ అడ్డుపడుతుంటారట. సిమ్రాన్‌ ఏంటి? సమంతపై పగ పట్టడం ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా రియల్‌ లైఫ్‌లో అనుకొంటే తప్పులో కాలేసినట్టే మరి.

శివ కార్తికేయన్‌ సరసన సమంత కథానాయికగా నటిస్తోన్న చిత్రంలో సిమ్రాన్‌ విలన్‌గా నటిస్తున్నారట. అసలు విషయం అది. పదేళ్ల క్రితం కథానాయికగా వెండి తెరను ఏలిన సిమ్రాన్‌ ఇప్పుడు కీలక పాత్రలు చేయడానికి రెడీ అయ్యారు. దర్శకుడు పొన్‌రామ్‌ చెప్పిన కథ నచ్చి, విలన్‌ రోల్‌ అంగీకరించారట. నాయికగా అలరించిన సిమ్రాన్‌ ప్రతినాయికగానూ భేష్‌ అనిపించుకుంటారని చెప్పొచ్చు. ఎనీ డౌట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement