సీమరాజా చిత్రంలో శివకార్తికేయన్, సమంత
సాక్షి సినిమా: ఈ రోజుల్లో సెన్సార్‌బోర్డు నుంచి యు సర్టిఫికెట్‌ను పొందడం సాధారణ విషయం కాదు. చాలా మంది దర్శక, నిర్మాతలు యు/ఏ సర్టిఫికెట్ వస్తే చాలు అనుకునే పరిస్థితి. అలాంటిది సీమరాజా చిత్రం క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. ఇది విశేషమే మరి. వరుస విజయాలతో జోరు మీదున్న నటుడు శివకార్తీకేయన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీమరాజా. వివాహానంతరం వరుస సక్సెస్‌లతో అగ్రనాయకిగా రాణిస్తున్న సమంత ఇందులో కథానాయకి. రెమో, వేలైక్కారన్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఆర్‌డీ.రాజా తన 24 ఎఎం. స్టూడియో పతాకంపై నిర్మించిన తాజా చిత్రం ఇది. పోన్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీ ఇమాన్ సంగీతాన్ని అందించారు.
నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న విడుదలకు ముస్తాబవుతోంది. చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యు సర్టిఫికెట్‌ను అందంచడంతో పాటు సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే మంచి కథా చిత్రం అని కితాబు కూడా ఇచ్చారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రాజా తెలుపుతూ సీమరాజా మంచి తరుణంలో తెరపైకి రానున్న చక్కని కమర్శియల్ ఎంటర్‌టెయినర్ అని చెప్పారు. శివకార్తీకేయన్, దర్శకుడు పొన్‌రామ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంలో మనసుల్ని హత్తుకునే సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో కూడిన అందమైన సన్నివేశాలు ఉన్నాయన్నారు. అలరించే విజువల్స్, పాటలు వెరసి ప్రేక్షకులు మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పారు. వినాయక చతుర్ధశి పండగ సందర్భంగా సీమరాజా చిత్రాన్ని సెప్టెబరు 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత రాజా వెల్లడించారు. నటి సిమ్రాన్, సూరి, లాల్, నెపోలియన్, మనోబాల, యోగిబాబు, నాన్ కడవుల్ రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment