తమిళసినిమా: రజనీమురుగన్, రెమో, వేలైక్కారన్ ఇలా సక్సెస్‌ల స్వారీ చేస్తున్న యువ కథానాయకుడు శివకార్తికేయన్. అంతకు ముందు కూడా వరుత్తపడాద వాలిబర్‌సంఘం, కాక్కీసట్టై, మాన్‌కరాటే వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న నటుడీయన. స్వయంకృషితో ఎదిగిన కథానాయకుల్లో ఒకరు శివకార్తికేయన్. తన ఒక్కో చిత్రాన్ని అన్ని కోణాల్లో ఆచితూచి ఎంపిక చేసుకుని ముందడుగు వస్తున్నారు.
వరుత్తపడాద వాలిభర్‌సంఘం, రజనీమురుగన్ చిత్రాల దర్శకుడు పొన్‌రామ్, రెమో, వేలైక్కారన్ చిత్రాల నిర్మాత 24ఏఎం. స్టూడియో అధినేత ఆర్‌డీ.రాజా, శివకార్తికేయన్‌ల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం సీమరాజా. సమంత నాయకి, డి.ఇమాన్ సంగీతదర్శకుడు. పోలా కాంబినేషన్ అదిరిపోలా? ఇలాంటి చిత్రానికి అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రజనీమురుగన్ చిత్రం తరువాత మరోసారి శివకార్తికేయన్ గ్రామీణ కథలో నటిస్తున్న చిత్రం ఇది. దీని చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది.
త్వరలో చిత్ర గీతాలను, వినాయక చవితికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ఆర్‌డీ.రాజా సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. శనివారం నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజు. శుక్రవారం అర్ధరాత్రి సీమరాజా టైటిల్‌ను చిత్ర వర్గాలు ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఎగిరి రెండు కాళ్లపై నిలబడ్డ గుర్రంపై కళ్లేలు చేత బట్టి చిరుదరహాసం చేస్తూ కూర్చున్న శివకార్తికేయన్ ఫొటోతో కూడిన ఈ పోస్టర్ చాలా వేగంగా సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక శివకార్తికేయన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఈ సీమరాజా చిత్ర పోస్టర్ చిత్రవర్గాలను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment