నటి సిమ్రాన్ అంటే ఎంతో ఇష్టం: మనీషా యాదవ్ | i like actress simran verymuch, says manisha yadav | Sakshi
Sakshi News home page

నటి సిమ్రాన్ అంటే ఎంతో ఇష్టం: మనీషా యాదవ్

Published Mon, Mar 23 2015 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

నటి సిమ్రాన్ అంటే ఎంతో ఇష్టం: మనీషా యాదవ్

నటి సిమ్రాన్ అంటే ఎంతో ఇష్టం: మనీషా యాదవ్

తమిళ సినిమా : నటి సిమ్రాన్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనని ఆమెకు తీవ్ర అభిమానినని అంటోంది నటి మనీషా యాదవ్. వళక్కుయన్ 18/9 చిత్రం ద్వారా తమిళ తెరపై ప్రత్యక్షమైన ఈ ఉత్తరాది భామ, ఆ తరువాత కాదల్ చెయ్‌వీర్ తదితర విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ మధ్య చిన్న వివాదంలో చిక్కుకుని కోలీవుడ్‌కు దూరమైన మనీషా తాజాగా జి.వి.ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. టైటిల్‌తోనే బోలెడు ప్రచారం పొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే కయల్ చిత్రం ఫేమ్ ఆనంది ఒక నాయికగా నటి స్తోంది. అలాగే మరో ముఖ్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ నటిస్తోంది. కాగా ఇప్పుడు నటి మనీషా యాదవ్ మరో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ చిత్రంలో చోటు సంపాదించుకోవడం గురించి మనీషా మాట్లాడుతూ, ‘త్రిష ఇల్లన్న నయనతార’ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇందులో తనది చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్రని చెప్పింది. జి.వి.ప్రకాశ్ కుమార్ మంచి సంగీత దర్శకుడే కాక, నటనలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారన్న విషయాన్ని మూడు రోజుల షూటింగ్‌లోనే తాను గ్రహించానని పేర్కొంది. దర్శకుడు ఆదిక్ సన్నివేశాలను అర్థవంతంగా వివరిస్తూ ఆర్టిస్టుల నుంచి తనకు కావలసిన అభినయాన్ని రాబట్టుకుంటున్నారని అంది. ఇకపోతే తాను నటి సిమ్రాన్‌కు తీవ్ర అభిమానినని పేర్కొంది. ఆమె నటిస్తున్న చిత్రంలో తానూ ఒక భాగం అయినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. సిమ్రాన్‌లా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. అయితే ఇప్పటి వరకూ తాను ఆమెను కలుసుకోలేదని, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌లో కలుసుకునే అవకాశం రాబోతుందన్న ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నానని మనీషా అంది. కాగా ఈ చిత్రాన్ని కామియో ఫిల్మ్స్ పతాకంపై సీజె. కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement