
ఐదు వందల మంది స్టూడెంట్స్‌తో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడిపోతోంది. అక్కడికొచ్చిన రజనీ కాంత్ మైక్ అందుకుని స్టూడెంట్స్‌ని ఉద్దేశిస్తూ స్పీచ్ స్టార్ట్ చేశారు. విద్యార్థులంతా రజనీ స్పీచ్‌కి ఇంప్రెస్ అయిపోయి ఈలల కొట్టసాగారు. ఏంటీ రజనీకాంత్ రాజకీయ సభ గురించి ప్రస్తావిస్తున్నాం అనుకుంటున్నారా? కాదు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కోసం షూట్ చేసిన ఓ సన్నివేశాన్ని వివరిస్తున్నాం. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ నెట్‌వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు.
మరో కథానాయికగా త్రిష, మాళవికా మోహనన్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట. అందులో భాగంగానే సుమారు 500 మంది స్టూడెంట్స్‌కి ఉపన్యాసం ఇస్తున్నటువంటి ఓ సన్నివేశాన్ని షూట్ చేశారట దర్శకుడు కార్తీక్. స్టేజ్ మీద సింహంలా సింగిల్‌గా డైలాగ్స్ పలికే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. మరి సినిమా మొత్తం ప్రొఫెసర్‌గానే రజనీకాంత్ కనిపిస్తారా అంటే? కాదు.. ఫ్లాష్‌బ్యాక్‌లో డాన్‌గా కనిపిస్తారట. విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment