శ్రీదేవి తర్వాత నేనే!
హెడ్డింగ్ చూడగానే శ్రీదేవి ఎక్కడ? కంగనా రనౌత్ ఎక్కడ? అనుకుంటున్నారా? కరెక్టే.. నటిగా దాదాపుగా 50 ఏళ్ల కెరీర్ ఉన్న శ్రీదేవితో పదేళ్ల కెరీర్ మాత్రమే ఉన్న కంగనాకి పోలిక ఏంటి? స్వయంగా కంగనానే ఈ పోలిక పెట్టారు. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ‘సిమ్రాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడే శ్రీదేవి టాపిక్ తీసుకొచ్చారు కంగనా. ‘‘ప్రస్తుతం నేను చేస్తున్న ‘సిమ్రాన్’ కామెడీ మూవీ. శ్రీదేవిగారి తర్వాత కామెడీ టచ్ ఉన్న సినిమాలో నటించిన ఏకైక హీరోయిన్ నేనే అని నా నమ్మకం. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’లో కామెడీ చేశా. ఇప్పుడు ‘సిమ్రాన్’లో. హీరోయిన్లకు కామెడీ చేసే స్కోప్ దక్కదు. లక్కీగా నాకు దొరికింది’’ అన్నారామె. వచ్చే ఏడాది కంగనా దర్శకురాలిగా మారనున్నారు. ఆ సినిమా పేరు ‘తేజు’. ఇది కూడా కామెడీ మూవీయే అని కంగనా అన్నారు. ఇందులో కంగనా 80 ఏళ్ల వృద్ధురాలిగా నటించనున్నారు.