Kangna Ranawat
-
చట్టానికి ఎవరూ అతీతులు కారు: కంగనాకు కౌంటర్
Minister Nawab Malik Counter To Kangana: మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఉద్దేశిస్తూ "చట్టానికి ఎవరూ అతీతులు కారు" అంటూ ఘాటుగా విమర్శించారు. అయితే సిక్కులపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ బాలీవుడ్ నటి కంగానా పై ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: IT Raids: వామ్మో!...పైప్‌లైన్‌లో నోట్ల కట్టలు..!!) అంతేకాదు కంగనా రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయన్నారు. పైగా ఆమె పై కేసు నమోదు చేసి చర్య తీసుకుంటే సరిపోదని ఆమెకు కేంద్రం గతేడాది ఇచ్చిన వై ప్లస్ భద్రతను కూడా తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాదు కేంద్రం ఆమె తండ్రి అభ్యర్ధన మేరకు ఈ భద్రతను ఇచ్చిన సంగతిని కూడా గుర్తుచేశారు. గత కొన్ని రోజులుగా కంగనా ప్రతి ఒక్కరినీ దుర్భాషలాడుతున్న తీరు.. మన జాతిపిత (మహాత్మా గాంధీ)ని అవమానించడం.. ఆజాదీ (స్వాతంత్య్రం) నకిలీదని, మనం బిచ్చగాళ్లమని... వ్యాఖ్యలు చేసి ఆమె వివిధ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందంటూ నవాబ్ మాలిక్ మండిపడ్డారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవండతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన తరుణంలో కూడా కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దూమారం లేపడమే కాక ఆమెకు అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అంతేకాదు కంగనా చేస్తున్న ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కారణంగానే మేలో ట్విటర్.. నిబంధనలను పదే పదే ఉల్లంఘించిదంటూ ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ సిక్కు గురుద్వార్ మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్జీఎంఎస్) భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలో కంగనా రనౌత్‌కు ప్రదానం చేసిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
శ్రీదేవి తర్వాత నేనే!
హెడ్డింగ్ చూడగానే శ్రీదేవి ఎక్కడ? కంగనా రనౌత్ ఎక్కడ? అనుకుంటున్నారా? కరెక్టే.. నటిగా దాదాపుగా 50 ఏళ్ల కెరీర్ ఉన్న శ్రీదేవితో పదేళ్ల కెరీర్ మాత్రమే ఉన్న కంగనాకి పోలిక ఏంటి? స్వయంగా కంగనానే ఈ పోలిక పెట్టారు. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ‘సిమ్రాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడే శ్రీదేవి టాపిక్ తీసుకొచ్చారు కంగనా. ‘‘ప్రస్తుతం నేను చేస్తున్న ‘సిమ్రాన్’ కామెడీ మూవీ. శ్రీదేవిగారి తర్వాత కామెడీ టచ్ ఉన్న సినిమాలో నటించిన ఏకైక హీరోయిన్ నేనే అని నా నమ్మకం. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’లో కామెడీ చేశా. ఇప్పుడు ‘సిమ్రాన్’లో. హీరోయిన్లకు కామెడీ చేసే స్కోప్ దక్కదు. లక్కీగా నాకు దొరికింది’’ అన్నారామె. వచ్చే ఏడాది కంగనా దర్శకురాలిగా మారనున్నారు. ఆ సినిమా పేరు ‘తేజు’. ఇది కూడా కామెడీ మూవీయే అని కంగనా అన్నారు. ఇందులో కంగనా 80 ఏళ్ల వృద్ధురాలిగా నటించనున్నారు. -
కత్తి తిప్పడం మొదలుపెడితే!
యుద్ధంలో రాజ్యక్షేమం కోసం పోరాడేది సైనికుడే కావచ్చు. కానీ ఆ సైనికుడి ధైర్యం అంతా ఆ రాజ్యాధినేత ధీరత్వం మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి ధీరత్వం కలిగిన రాణి కదన రంగంలో కత్తి దూసుకుంటూ వస్తుంటే శత్రువు కళ్ళలోనే కాదు, గుండెల్లోను ఓటమి భయం గుబులు రేపుతుంది. సరిగ్గా ఇలాంటి ధీరత్వం, శూరత్యం కలిగిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో నటించాలంటే అంత సులభం కాదు. అందుకు యుద్ధ విద్యల్లో ఎంతో నేర్పు, నైపుణ్యం ఉండాలి. కంగనా రనౌత్‌కు ఆ నైపుణ్యం ఉంది. రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘మణికర్ణిక’లో ఆమె టైటిల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయ్గా సక్సెస్ అయ్యేందుకు కంగనా ఏకాగ్రతతో యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. ఈ సినిమా కోసం కంగనా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలు బయటికొచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ ఫొటోనే.