కత్తి తిప్పడం మొదలుపెడితే! | Kangna Ranawat in Rani Jhansi Lakshmi Bhai movie | Sakshi
Sakshi News home page

కత్తి తిప్పడం మొదలుపెడితే!

Published Tue, Jun 13 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

కత్తి తిప్పడం మొదలుపెడితే!

కత్తి తిప్పడం మొదలుపెడితే!

యుద్ధంలో రాజ్యక్షేమం కోసం పోరాడేది సైనికుడే కావచ్చు. కానీ ఆ సైనికుడి ధైర్యం అంతా ఆ రాజ్యాధినేత ధీరత్వం మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి ధీరత్వం కలిగిన రాణి కదన రంగంలో కత్తి దూసుకుంటూ వస్తుంటే శత్రువు కళ్ళలోనే కాదు, గుండెల్లోను ఓటమి భయం గుబులు రేపుతుంది.

సరిగ్గా ఇలాంటి ధీరత్వం, శూరత్యం కలిగిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ పాత్రలో నటించాలంటే అంత సులభం కాదు. అందుకు యుద్ధ విద్యల్లో ఎంతో నేర్పు, నైపుణ్యం ఉండాలి. కంగనా రనౌత్‌కు ఆ నైపుణ్యం ఉంది. రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత కథ ఆధారంగా క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మణికర్ణిక’లో ఆమె టైటిల్‌ రోల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా సక్సెస్‌ అయ్యేందుకు కంగనా ఏకాగ్రతతో యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. ఈ సినిమా కోసం కంగనా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలు బయటికొచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ ఫొటోనే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement