Rakesh Srinivas
-
సెటైర్ ఎవరిపై అనేది సీక్రెట్
‘‘వివాదాల వల్ల సినిమాలు ఆడతాయనుకోవడం నిజంగా మూర్ఖత్వం. కాంట్రవర్సీ ప్రభావం సినిమా విడుదల రోజు తొలి ఆట వరకే. సినిమాలో విషయం లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు’’ అని దర్శకుడు రాకేశ్ శ్రీనివాస్ అన్నారు. షఫీ హీరోగా రాకేశ్ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో విజయకుమార్ రాజుతో కలిసి నిర్మించిన చిత్రం ‘ఏ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. జనవరి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రాకేశ్ శ్రీనివాస్ విలేకరులతో ముచ్చటిస్తూ -‘‘సెటైరికల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. అయితే... అది ఎలాంటి సెటైర్, ఎవరిపై సంధించిన సెటైర్ అనేది విడుదల దాకా సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ సినిమా ఎవర్నీ దృష్టిలో పెట్టుకొని చేసింది కాదనీ ఆయన చెప్పారు. -
ఇది ఓ దర్శకుడి కథ
షఫీ ప్రధాన పాత్రలో విజయ్‌కుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘నేను తీసే సినిమాలకు సంబంధించిన కథ చెబితే అర్థం కాదు.. తెరపై ఆ కథ చూస్తేనే అర్థమవుతుంది అనే ధోరణిలో ఉండే దర్శకుడి కథతో ఈ చిత్రం సాగుతుంది. షఫి నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. దర్శకుడు ఏం చెబితే అది చేశాననీ, ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరాయనీ షఫీ అన్నారు. రీ-రికార్డింగ్‌కి మంచి స్కోప్ ఉన్న కథ అనీ, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లే చిత్రమిదనీ సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ తెలిపారు. -
ఆసక్తి రేపుతున్న సినిమా
‘‘వ్యక్తుల జీవితం మీద వచ్చిన సినిమాలు తక్కువ. మరి ఈ సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తి కలుగుతోంది’’ అని నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. షఫీ, జోయాఖాన్ జంటగా రాకేశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విజయ్ కుమార్ రాజు, రాకేశ్ శ్రీనివాస్ నిర్మించిన ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’ పాటల సీడీని హైదరాబాద్‌లో యండమూరి ఆవిష్కరించారు. వర్మ పాత్రలో షఫీ ఒదిగిపోయి నటించాడని దర్శకుడు ప్రశంసించారు. ఇందులో నాలుగు పాటలుంటాయని సంగీత దర్శకుడు ఆనంద్ చెప్పారు. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. విభిన్నమైన ఇతివృత్తంతో వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని షఫీ అన్నారు.