ఆసక్తి రేపుతున్న సినిమా
‘‘వ్యక్తుల జీవితం మీద వచ్చిన సినిమాలు తక్కువ. మరి ఈ సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తి కలుగుతోంది’’ అని నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. షఫీ, జోయాఖాన్ జంటగా రాకేశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విజయ్ కుమార్ రాజు, రాకేశ్ శ్రీనివాస్ నిర్మించిన ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’ పాటల సీడీని హైదరాబాద్‌లో యండమూరి ఆవిష్కరించారు. వర్మ పాత్రలో షఫీ ఒదిగిపోయి నటించాడని దర్శకుడు ప్రశంసించారు. ఇందులో నాలుగు పాటలుంటాయని సంగీత దర్శకుడు ఆనంద్ చెప్పారు. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. విభిన్నమైన ఇతివృత్తంతో వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని షఫీ అన్నారు.