ఇది ఓ దర్శకుడి కథ
షఫీ ప్రధాన పాత్రలో విజయ్‌కుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘నేను తీసే సినిమాలకు సంబంధించిన కథ చెబితే అర్థం కాదు.. తెరపై ఆ కథ చూస్తేనే అర్థమవుతుంది అనే ధోరణిలో ఉండే దర్శకుడి కథతో ఈ చిత్రం సాగుతుంది. షఫి నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. దర్శకుడు ఏం చెబితే అది చేశాననీ, ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరాయనీ షఫీ అన్నారు. రీ-రికార్డింగ్‌కి మంచి స్కోప్ ఉన్న కథ అనీ, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లే చిత్రమిదనీ సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ తెలిపారు.