కథ చెప్పినప్పుడు భయపడ్డాం | vishapuram songs release | Sakshi
Sakshi News home page

కథ చెప్పినప్పుడు భయపడ్డాం

Published Sun, Sep 9 2018 1:38 AM | Last Updated on Sun, Sep 9 2018 1:54 AM

vishapuram songs release - Sakshi

షఫీ

ఆయుష్‌ రామ్, శ్రవణి, ‘ఛత్రపతి’ షఫీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విషపురం’. సందిరి శ్రీనివాస్‌ దర్శకత్వంలో పాతురి బుచ్చిరెడ్డి, పాతురి మాధవరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్‌ అవుతోంది. శ్రీ వెంకట్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చిత్ర దర్శకుడు, నిర్మాతలు విడుదల చేశారు. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘సందిరి శ్రీనివాస్‌ చెప్పిన కథతో సినిమా చేయడానికి ముందు భయపడ్డాం. కానీ, ఆయన పట్టుదలతో మమ్మల్ని ఒప్పించి ఈ సినిమా పూర్తి చేశారు.

ఇదే దర్శకుడితో మా బ్యానర్‌లో మరో చిత్రం నిర్మిస్తున్నాం. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి, మమ్మల్ని ముందుకు నడిపించాలి’’ అన్నారు. ‘‘జాంబీల మీద ఇంతవరకూ ఎవరూ సినిమా చేయలేదు. మేము కష్టపడి ఈ సినిమా చేయలేదు.. ఇష్టపడి చేసాం. ఒక కొత్త సినిమా చేశామన్న తృప్తితో ఉన్నాం. మా నిర్మాతలు ఫైనల్‌ ఔట్‌పుట్‌తో సంతోషంగా ఉన్నారు’’ అన్నారు సందిరి శ్రీనివాస్‌. కెమెరామెన్‌ కిషన్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: రోహిత్‌ జిల్లా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement