![Idi Kala Kadu movie releasing shortly - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/16/PHOTO-2020-07-12-18-46-16.jpg.webp?itok=7DTnJEiq)
అదీబ్ నజీర్
నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇది కల కాదు’. అదీబ్ నజీర్, దానికా సింగ్, షఫీ, బెనర్జీ, వైభవ్ సూర్య, పూజిత జొన్నలగడ్డ ప్రధాన పాత్రల్లో నటించారు. అదీబ్ నజీర్ దర్శకత్వంలో పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సందర్భంగా అదీబ్ నజీర్ మాట్లాడుతూ– ‘‘స్త్రీలను దేవతలుగా కొలిచే మన దేశంలోనూ నేటి ఆధునిక కాలంలో వారిపై లైంగిక వేధింపులు జరగడం బాధాకరం. మన చుట్టుపక్కల జరుగుతున్న వాస్తవ సంఘటనలు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. దాదాపు రెండున్నర కోట్లు బడ్జెట్‌తో నిర్మించాం’’ అన్నారు సహ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రుబియా కౌ కాబ్. ఈ చిత్రానికి కెమెరా: వి. సత్యానంద్.
Comments
Please login to add a commentAdd a comment