benarjee
-
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ సమర్ బెనర్జీ మృతి
కోల్‌కతా: అలనాటి మేటి ఫుట్‌బాలర్, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సమర్ ‘బద్రూ’ బెనర్జీ కన్ను మూశారు. 92 ఏళ్ల సమర్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. హైదరాబాదీ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచ్‌గా, సమర్ బెనర్జీ కెప్టెన్‌గా మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత్ 4–2తో ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీస్‌లో 1–4తో యుగోస్లావియా చేతిలో ఓడిన భారత్... కాంస్య పతక మ్యాచ్‌లో 0–3తో బల్గేరియా చేతిలో ఓడిపోయింది. దేశవాళీ ఫుట్‌బాల్‌లో విఖ్యాత మోహన్ బగాన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన సమర్ బెనర్జీ తన క్లబ్ జట్టుకు డ్యూరాండ్ కప్ (1953), రోవర్స్ కప్ (1955)లలో విజేతగా నిలిపారు. జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు రెండుసార్లు (1953, 1955) టైటిల్ అందించారు. అనంతరం సమర్ కోచ్‌గా మారి 1962లో బెంగాల్ జట్టు ఖాతాలో మరోసారి సంతోష్ ట్రోఫీని చేర్చారు. -
చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు
సౌత్ ఇండియా సినిమాలతోపాటు హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు సీనియర్ ఆర్టిస్ట్ బెనర్జీ. సుమారు 400కుపైగా సినిమాల్లో యాక్ట్ చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'ఆచార్య' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌ను తాను చేస్తానని వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'చిరంజీవి చాలా మంచి మనిషి. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక వేదికపై చిరంజీవి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన అనుమతి తీసుకుని చిరంజీవిపై బయోపిక్ తీస్తే బాగుంటుందని, చిత్రపరిశ్రమలో ఆయన పడిన కష్టాలు, విజయాలు, అవార్డులు, రివార్డులతో సినిమా తీయగలిగితే అద్భుతంగా ఉంటుంది అని అన్నాను. కానీ నేనే ఆ బయోపిక్ తీస్తానని చెప్పలేదు. సోషల్ మీడియా వాళ్లు అలా ప్రచారం చేశారు.' అని బెనర్జీ చెప్పుకొచ్చారు. చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్ -
‘సైదులు’ ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్
రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సైదులు’. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై మరబత్తుల బ్రహ్మానందం నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబా పి.ఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకిది తొలి చిత్రం. 1980లో తెలంగాణ నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించామని మేకర్స్ వెల్లడించారు. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. సీనియర్ నటుడు బెనర్జీ ఓ కీలక పాత్రలో నటించడం సినిమాకు కలిసొచ్చిందని తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూనిట్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉన్నారు.మరోవైపు ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఫిలిం సెలబ్రిటీలు హాజరవుతారని చిత్ర యూనిట్ పేర్కొంది. (చదవండి: ‘ఆదిపురుష్’నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) -
మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ
Maa elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల రోజు తనను మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారని నటుడు బెనర్జీ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అలాంటిది అందరి ముందు మోహన్ బాబు బూతులు తిడుతూ అవమానించారని చెబుతూ బెనర్జీ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'ఎలక్షన్స్‌లో గెలిచానని అందరూ కంగ్రాట్స్ చెప్పినా అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే పోలింగ్ రోజు ఉదయమే వందల మందిలో మోహన్ బాబు నన్ను పచ్చి బూతులు తిట్టారు.తనీష్‌ను తిడుతుంటే ఆపినందుకు నన్ను మోహన్‌బాబు కొట్టబోయారు. చదవండి: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ విష్ణు నన్ను బలవంతంగా ఆపారు: బెనర్జీ పోలింగ్ జరిగే చోట మోహన్‌బాబు అలా ప్రవర్తిస్తున్నా ఎవరూ ఆపలేదు. తనీష్, నాకు చాలా బాధకలిగి కంటతడి పెట్టుకున్నామ. మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నా. మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు నన్ను బలవంతంగా ఆపారు. మోహన్‌బాబు సతీమణి కూడా ఫోన్ చేసి నన్ను ఓదార్చారు. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలను నుంచి ఇంకా తేరుకోలేదు చాలా చాలా బాధ కలిగింది. ఇలా ఎందుకు బతకాలి మనం?ఇలాంటి అసోసియేషన్‌లో ఎందుకు ఉండాలి' అంటూ బెనర్జీ కంటతడి పెట్టారు. చదవండి: నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్ బాబు -
Rukmini Banerji: స్మార్ట్ మామ్ ఈ రుక్మిణి.. ఏం చేస్తారంటే!
పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారు. కానీ ఏడాది ఏడాదికి తరగతులు మాత్రమే మారుతున్నాయి. వారు నేర్చుకున్నది ఏమీ కనిపించడం లేదు. స్కూళ్లలో చదువుతోన్న యాభైశాతం మంది పిల్లలు కనీసం పదాలు కూడా సరిగా రాయలేకపోతున్నారు. చిన్నపాటి వాక్యాలను కూడా చదవలేకపోతున్నారు. ఇక గణితం అయితే అంతే సంగతులు. ఈ స్థితిని ‘లెర్నింగ్ ప్రావర్టీ’గా పరిగణించాల్సిన అవసరం ఉంది. దీని మీద దృష్టి కేంద్రీకరించకపోతే రేపటితరం భవిష్యత్ అంధకారమవుతుంది అని అర్థవంతంగా చెప్పారు డాక్టర్ రుక్మిణీ బెనర్జి. దీంతో వందకుౖ పెగా దేశాల విద్యావేత్తలు పోటీపడిన బహుమతిని అవలీలగా అందుకున్నారు రుక్మిణీ బెనర్జీ. పాఠశాల విద్యలో అభ్యసన ప్రక్రియను మెరుగు పరచడానికి ఆమె సూచించిన అంశాలకు గాను ఎడ్యుకేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘యిదన్’ బహుమతి అందుకున్నారు. ఈ బహుమతి కోసం 130 దేశాలకు చెందిన విద్యావేత్తలు పోటీపడగా బెనర్జీని బహుమతి వరించడం విశేషం. ఆర్థికవేత్త నుంచి విద్యావేత్తగా... బిహార్‌కు చెందిన డాక్టర్ రుక్మిణీ బెనర్జీ న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అర్థశాస్త్రాన్ని చదివి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటి స్కాలర్‌గా చేరారు. తరువాత చికాగో యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికాలోనే స్థిరపడిన బెనర్జి 1996లో ఇండియా వచ్చారు. అప్పుడు ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ఎన్జీవో ‘ప్రథమ్’లో చేరారు. అప్పటి నుంచి విద్యావ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కూలు పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బెనర్జీ నేతృత్వంలోని బృందం ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు’(ఏఎస్ ఈఆర్)ను విడుదల చేసింది. 2005–15 వరకు ఇంటింటికి తిరిగి సర్వే చేసి విడుదల చేసిన నివేదిక అది. వందరోజులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఆరు లక్షలమంది పిల్లల అక్షరాస్యత నాణ్యతపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో అనేక స్కూళ్లను సందర్శించి ఎక్కువమంది పిల్లలు ప్రాథమిక అంశాలను కూడా చదవలేకపోవడం, చిన్నపాటి గుణింతాలు కూడా చేయలేకపోవడం గుర్తించి, అంతేగాక ‘టీచింగ్ ఎట్ ద రైట్ లెవల్’ (టీఏఆర్‌ఎల్) కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసనను మెరుగు పరచవచ్చని సూచించారు. అంతేగాక టీఏఆర్ఎల్ను కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి మంచి ఫలితాలను చూపించారు. ఈ కార్యక్రమానికి రుక్మిణి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను యిదన్ ప్రైజ్ వరించింది. ఏఎస్ఈఆర్.. ఏఎస్ఈఆర్తోపాటు .. పిల్లల కోసం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దినపత్రికల్లో ఆరి్టకల్స్ రాయడం, పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధంగా కథల పుస్తకాలను బెనర్జీ రాస్తున్నారు. ఏఎస్ఈఆర్ నివేదిక రూపొందించే బృందాన్ని ముందుండి నడిపించారు. ఈ నివేదికను విడుదల చేసిన తరువాత బెనర్జి ప్రథమ్‌కు సీఈవో అయ్యారు. విద్యావ్యవస్థ అభివృద్ధిని గుర్తించిన బిహార్ ప్రభుత్వం 2008లో ‘మౌలానా అబుల్ కలామ్ శిక్షా పురస్కార్’తో సత్కరించింది. రాష్ట్రంలో ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి బెనర్జీనే. తాజాగా 2021 సంవత్సరానికి గాను విద్యాభివృద్ధికి కృషిచేస్తోన్న వారికిచ్చే ‘యిదన్’ బహుమతిని అందుకున్నారు. స్మార్ట్ మామ్ విద్యద్వారా మెరుగైన ప్రపంచాన్ని అందించేవారిని సత్కరించేందుకు గాను 2016లో చార్లెస్ చెన్ యిదన్ ‘ద యిదన్ అవార్డు’ను ఏర్పాటు చేశారు. ఈ బహుమతి పొందిన వారికి స్వర్ణ పతకంతోపాటు, 3.9 మిలియన్ డాలర్లు( మన రూపాయల్లో దాదాపు 29 కోట్లు) దీనిలో సగం మొత్తా్తన్ని విద్యాభివృద్దికి వినియోగించాలి. ‘‘యిదన్ ప్రైజ్ విద్యాభివృద్ధికి మరింత కృషిచేసే అవకాశం కల్పించింది. గత 15 ఏళ్లుగా పిల్లల అక్షరాస్యతపై పనిచేస్తున్నాం. మొహల్లా లెర్నింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా వలంటీర్లతో ‘టీచింగ్ ఎట్ ది రైట్ లెవల్’ను అందిస్తున్నాము. ‘స్మార్ట్ మామ్’ పేరిట విద్యార్థుల తల్లులకు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా చిన్నపాటి యాక్టివిటీలను అప్పజెప్పి వారి ద్వారా పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పదివేల కమ్యూనిటీల్లో 30 నుంచి 35 వేలమంది తల్లులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తాము’’ అని రుక్మిణీ బెనర్జీ వివరించారు. చదవండి: కూచునే హక్కు మీకు ఉంది... -
ఇది కల కాదు
నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇది కల కాదు’. అదీబ్ నజీర్, దానికా సింగ్, షఫీ, బెనర్జీ, వైభవ్ సూర్య, పూజిత జొన్నలగడ్డ ప్రధాన పాత్రల్లో నటించారు. అదీబ్ నజీర్ దర్శకత్వంలో పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సందర్భంగా అదీబ్ నజీర్ మాట్లాడుతూ– ‘‘స్త్రీలను దేవతలుగా కొలిచే మన దేశంలోనూ నేటి ఆధునిక కాలంలో వారిపై లైంగిక వేధింపులు జరగడం బాధాకరం. మన చుట్టుపక్కల జరుగుతున్న వాస్తవ సంఘటనలు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. దాదాపు రెండున్నర కోట్లు బడ్జెట్‌తో నిర్మించాం’’ అన్నారు సహ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రుబియా కౌ కాబ్. ఈ చిత్రానికి కెమెరా: వి. సత్యానంద్. -
వ్యూహాలు ఫలించాయా?
సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్ ముఖ్య తారలుగా కేటీ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? అనే అంశాలతో రూపొందిన చిత్రమిది. ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగస్టు 15న విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 1,2’ చిత్రాలకు మా సినిమాకి సంబంధం లేదు. ఇందులో కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు కె.టి.నాయక్. -
అవసరమైతే కోర్టుకి వెళతాను
బెనర్జీ, వెంకట్, ముమైత్‌ఖాన్, సంజీవ్ కుమార్, సుమన్ రంగనాథన్ ప్రధాన పాత్రధారులుగా కేటీ నాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా దండుపాళ్యం 4’ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? పోలీసులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? అనే అంశాలతో మా ‘దండుపాళ్యం 4’ రూపొందింది. ఇందులో ఏడుగురు ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘షూటింగ్ పూర్తయిన మా సినిమాను సెన్సార్‌కు అప్లై చేశాను. కంటెంట్ పరంగా సినిమాలో ఏదైనా సమస్య ఉంటే ఫలానా సన్నివేశాన్ని, ఫలానా డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి, లేకుంటే రిజెక్ట్ చేస్తానని అన్నారు. సినిమాలో ఉన్న సమస్య ఏంటో చెప్పకండా రిజెక్ట్ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత ఆయన ఈ సినిమాను సెన్సార్ చేయను. రివైజింగ్ కమిటీకి వెళ్లండన్నారు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నాను. రివైజింగ్ కమిటీనే కాదు... ట్రిబ్యునల్.. అదీ కాకపోతే కోర్టుకి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమాతో సెన్సార్ బోర్డుకి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సినిమాను మార్చిలో విడుదల చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సరికొత్తగా...
అమృత, ట్వింకిల్ కపూర్, తేజేశ్ వీర, హరీశ్ గైలి, జీవా, బెనర్జీ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బంజార’. గతంలో ‘క్షుద్ర’ వంటి హారర్ సినిమాతో ప్రేక్షకుల్ని భయపెట్టిన నాగుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వర్కింగ్ యూనిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కోయా రమేశ్‌బాబు, దేవభక్తుని నవీన్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్లో ఇంతవరకూ రాని సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కథాంశంతో తెరకెక్కిన మా సినిమాని తెలుగు, తమిళ భాషల్లో జనవరి నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. జీవీ, శరత్, ‘వేదం’ నాగయ్య, అనంత్, జ్యోతిశ్రీ, ‘జబర్దస్త్’ రాజు, అప్పారావు, శాంతి స్వరూప్, దొరబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ఎం. నరేంద్ర. -
కొత్తమ్మాయి!
కెనడాలో పది రోజులపాటు జరిగిన ‘టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్’ నిన్నటితో ముగిసింది. ‘స్పెషల్ ప్రెజెంటేషన్స్’ సెక్షన్ కింద ఆ ఫెస్టివల్లో ప్రదర్శనకు అవకాశం పొందిన ఫ్రెంచి సినిమా.. ‘మాయ’లో ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ అమ్మాయి ఆర్షి బెనర్జీ కెరీర్‌కు ఆ ముగింపు ఒక ప్రారంభాన్ని ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఆర్షి నటనకు అంతగా అభినందనలు లభించాయి! ఆర్షి బెనర్జీ : ఈ యువ మోడల్‌కు అనుకోకుండా ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించే అవకాశం చేజిక్కింది. అది కాస్తా టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవ ఎర్ర తివాచీపై నడిచేలా చేయడం ఆమెను మరింత ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది. మోడలింగ్ ఏజెన్సీ ‘ఇనేగా’ 19 ఏళ్ల మోడల్ ఆర్షి బెనర్జీని ఓ ఫ్రెంచ్ సినిమా ఆడిషన్‌కు రాగలరా అంటూ ఆహ్వానించినపుడు ఆమె పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే ఆడిషన్ పాసైన ఆమెకు ఏకంగా టైటిల్ రోలే లభించడంతో ఆనందంతో తబ్బిబ్బు అయ్యింది. తను నటించిన ఆ రొమాంటిక్ డ్రామా.. ‘మాయ’ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం అవుతుందనైతే ఆమె ఏమాత్రం ఊహించలేదు. ‘మాయ’ ఫ్రెంచి చిత్రం. మియా హన్సెస్ లవ్ ఆ చిత్ర దర్శకురాలు. ఆర్షి బెనర్జీ ఇండియా అమ్మాయి. కమ్మని కబురొచ్చింది! 30 ఏళ్ల ఫ్రెంచ్ వ్యక్తికి, టీనేజీ గోవా అమ్మాయి మధ్య సాగే ప్రేమాయణం చుట్టూ తిరిగే ఫ్రెంచ్–ఇంగ్లిష్ సినిమా ‘మాయ’. ఈ చిత్రంలోని పాత్ర కోసం 16–18 ఏళ్ల లోపు ఇండియన్ అమ్మాయి కోసం అన్వేషణ సాగింది. ఆ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న నందిని శ్రీకాంత్ ప్రయత్నాలు ఆర్షిని కలుసుకోవడంతో ముగిశాయి. ఆర్షి ఆడిషన్‌కు వెళ్లొచ్చింది. ఆ తర్వాత జలుబు బారిన పడి తన అపార్ట్మెంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్షికి నందిని నుంచి ఫోన్ వచ్చింది. డైరెక్టర్ హన్సెన్ దాదాపు 200 మందికి పైగా ఆడిషన్ టేపులను పరిశీలించాక ఆర్షిని కలుసుకునేందుకు మాత్రమే ఉత్సాహం కనబరుస్తున్నారన్నది కబురు. సినిమా ఆడిషన్లో పాల్గొన్న అనుభవం లేకపోవడంతో ఆర్షి మొదట కొంత నెర్వస్‌గా ఫీలైంది. రచయిత, దర్శకురాలు అయిన హన్సెస్ చిత్రాలేవి ఆర్షి అంతకు ముందు చూసి ఉండకపోవడంతో ఆమె తీసిన సినిమాల గురించి తెలుసుకుంది. వాటిలో ‘థింగ్స్ టు కమ్ (2011), ‘గుడ్‌బై ఫస్ట్ లవ్’ (2016) సినిమాలు ఆర్షికి నచ్చాయి. అమ్మ నుంచి ఇన్స్పిరేషన్ నటి, టెక్స్టైల్ డిజైనర్‌గా పేరుతెచ్చుకున్న తన తల్లి రతులా బెనర్జీ అడుగుజాడల్లోనే ఆర్షి ముందుకు సాగింది. ఆర్షి ముంబైలోని ర్యాన్ గ్లోబల్ స్కూల్లో చదువుకుంది. క్లాస్‌లోనే పొడగరి కావడంతో స్కూల్లో వేసే నాటకాల్లో ఆమెకు టీచర్, నాయనమ్మ వంటి పాత్రలే ఇచ్చేవారు. ఒక దశలో కాస్మటిక్ సర్జన్ కావాలని కోరుకున్నా.. సినిమాలే ఆమెకు లోలోపలి ‘ప్యాషన్’. పదహారేళ్ల వయసులోనే మోడలింగ్ కెరీర్ మొదలుపెట్టి, ముందుగా స్టిల్ కెమెరా ముందు తన ప్రతిభ చాటుకుంది ఆర్షి. ‘మాయ’ ఫిల్మ్‌లో పాత్ర కోసం కొంకణి భాష నేర్చుకుంది. ఇది తన పాత్రకు మరింత దగ్గరయ్యేలా చేసింది. మొత్తం మహిళా నేతృత్వం! కథలో.. తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉన్న ఫ్రెంచ్ వ్యక్తితో ఈ అమ్మాయి ప్రేమలో పడుతుంది. అతడి పేరు గాబ్రియల్. వార్ రిపోర్టర్. సిరియాకు బందీగా ఉండి ఎలాగో ఇండియా వస్తాడు. అక్కడ ఆర్షికి పరిచయం అవుతాడు. మాయ (ఆర్షి బెనర్జీ) అతడిని ప్రేమిస్తుంది. ఇలాంటి థీమ్‌తో కథ నడిపించడానికి కథన కౌశలం కావాలి. హీరో, హీరోయిన్ సన్నిహితంగా కనిపించే సన్నివేశాలను కూడా దర్శకురాలు గొప్పగా, కళాత్మకంగా చిత్రీకరించడాన్ని చూసి ఆర్షితో పాటు ఆమె తల్లి రతులా కూడా థ్రిల్ ఫీల్ అయ్యారు. డైరెక్టర్ మియా హన్సెస్ ఈ పాత్రను అందంగా మలిచారని, ఎక్కడా తప్పుడు అభిప్రాయాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని రతులా.. హన్సెస్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రంలోని వివిధ విభాగాలకు మహిళలే నేతృత్వం వహించడంతో ప్రతీరోజు ఏడెనిమిది గంటలు మాత్రమే ఈ బృందం పనిచేసింది. అందులోనూ వారాంతపు సెలవులు ఎంజాయ్ చేశారు. ప్రతిష్టాత్మక టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కడ ఆర్షి నటనకు తగిన గుర్తింపు లభించడంతో.. ఫ్రెంచ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఫిల్మ్స్‌లోనూ అవకాశం వస్తుందని నమ్ముతున్నారు ఆర్షి అండ్ టీమ్. ఇక.. ధర్మ లేదా యాష్‌రాజ్ నిర్మాణసంస్థలో నటించే అవకాశం లభిస్తే తన కంటే అదృష్టవంతురాలు ఎవరుంటారని నవ్వుతూ అంటోంది ఆర్షి బెనర్జీ. – కె.రాహుల్ -
జైలు నుంచి తప్పించారా?
సుమారంగనాధన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం–4’. కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో దండును తయారు చేసే నాయకుడిగా ముఖ్య పాత్రలో నటుడు బెనర్జీ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘నటుడిగా నాకిది వైవిధ్యమైన పాత్ర. నా పాత్రతో సహా మా దండు చేసే పోరాటాలు, ఇతర ప్రధాన పాత్రలు, చిత్రంలోని సన్నివేశాలు, సంఘటనలు, వాతావరణం వాస్తవికతకు అద్దం పడతాయి. నా పాత్ర ప్రశంసలు అందుకుంటుంది’’ అన్నారు. ‘‘ఏడుమంది గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటిస్తున్నారు. 40 మంది గ్యాంగ్‌లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథక రచనతోనే ఈ సినిమా రూపొందింది’’ అన్నారు కె.టి.నాయక్. ‘‘ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నాం’’ అన్నారు వెంకట్. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.గిరి, సంగీతం: ఆనంద్ రాజావిక్రమ్, -
పావగడలో ‘దండుపాళ్యం’
కర్ణాటక, పావగడ: పళవల్లి, నాగలమడక గ్రామాల పరిసర ప్రాంతాల్లో దండుపాళ్యం చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్న దండుపాళ్యం చిత్రం కన్నడలో విజయవంతమైన దండుపాళ్యం 1,2,3లకు కొనసాగింపుగా ఉంటుందని చిత్ర నిర్మాత వెంకట్ తెలిపారు. స్థానిక రాయల్ హెరిటేజ్ రిసార్ట్‌లో చిత్ర యూనిట్ ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైం, థ్రిల్లర్ కథాంశాలతో కూడిన దండుపాళ్యం చిత్రం షూటింగ్‌కు అనువైన ప్రాంతంగా పావగడను గుర్తించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో తెలుగు విలక్షణ నటుడు బెనర్జీ మాస్టర్ మైండ్‌గా ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. చిత్ర దర్శకుడు కేటీ నాయక్ మాట్లాడుతూ ఈ సినిమాకు బెనర్జి ఎనర్జీ అని చమత్కరించారు. బెనర్జి మాట్లాడుతూ బాలివుడ్, హాలివుడ్ సినిమాల షూటింగ్‌లకు పావగడలోని లొకేషన్లు బాగున్నాయన్నారు. సుమన్ రంగనాథ్, రాక్‌లైన్ సుధాకర్, సంజీవ్ కుమార్, బులెట్ సోము, అరుణ్ బచ్చన్, విఠల్ రంగాయన, స్నేహనాయర్, రిచా శాస్త్రి ముఖ్య తారాగణం. -
నటుడు బెనర్జీకి పితృవియోగం
నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య (86) తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ లాంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసిన రాఘవయ్య వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రంలో ఆయన నటించారు. రాఘవయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం వారి స్వగృహంలో ఉంచారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం మూడు గంటలకు ఫిలిం నగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రేమ పరుగు..
తొలివలపు చాలా చిత్రమైంది.. అది ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో తెలియదు.. ఎలా పెరుగుతుందో అర్ధమే కాదు. సాన్నిహిత్యం ఎద తలుపు తడితే, సారూప్యత చెలిమికి స్వాగతం పలుకుతుంది. అది వలపు మలుపు తిరుగుతుంది. కొందర్ని పాట కలుపుతుంది. మరికొందర్ని సాహిత్యం చేరువ చేస్తుంది. వాళ్లిద్దర్నీ మాత్రం పరుగు దగ్గర చేసింది. అథ్లెటిక్స్ అంటే తరగని ఇష్టం ఆకర్షణకు మూలమైంది. అదే పెళ్లిపందిరికి దారి తీసింది. ఒకరి అడుగులో ఒకరుగా సాగించే జర్నీకి నాంది పలికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లది ఒకటే మాట.. ఒకటే బాట. పోర్ట్ జింఖానా మైదానంలో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు అదే సంస్థలో సహ ఉద్యోగులుగా, జీవిత భాగస్వాములుగా కళకళలాడుతోంది. నువ్వు, నేనన్న తేడా లేకుండా, అరమరికలు లేకుండా సాగే దాంపత్యంలో ఆనందాన్ని ఒకే మాటగా చెప్పే పోర్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ చిన్నం బెనర్జీబాబు, అదే సంస్థలో సీనియర్ అసిస్టెంట్ బెర్నడెట్ల అనుబంధమే ఈ వారం 'యూ అండ్ ఐ' తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. అని పాడుకోవడానికి ఏలూరుకు చెందిన బెనర్జీబాబుకు, విశాఖపట్నంలోని పోర్ట్ క్వార్టర్స్‌కు చెందిన బెర్నడెట్కు అస్సలు తీరిక లేదు. అలా అని ఇద్దరి మధ్య తేడాలు, గొడవలు ఉన్నాయని కాదు. ఇద్దరికీ ఒకటే ఇష్టం.. అది అథ్లెటిక్స్. పరుగు పందాలు, చాంపియన్‌షిప్‌లు, పతకాలు, రికార్డులు.. ఇవే ఇద్దరి ఆలోచనలు. దాంతో వాళ్లకు వేరే ఆలోచన ఉండేది కాదు... ఇదంతా సుమారు మూడున్నర దశాబ్దాల కిందటి మాట. కానీ ఇప్పుడు.. ఇద్దరిదీ ఒకటే మాట. ‘ఆవిడ మంచి అథ్లెట్.. అంతే మంచి గృహిణి, మంచి తల్లి’ అని ఆయన కితాబిస్తే.. ‘నా మనసు ఎరిగిన వ్యక్తి.. నా అభివృద్ధికి దోహదపడ్డారు. అర్థం చేసుకుని, అండగా నిలిచారు.’ అంటారు బెర్నడెట్. ముప్ఫై ఏళ్ల వైవాహిక జీవితమనే ట్రాక్ మీద తమ ఇద్దరి రన్నింగ్ రేస్ సాఫీగా సాగిపోతోందంటే పరస్పర అవగాహన, గౌరవం, నమ్మకమే కారణమని బెర్నడెట్ అంటే చిర్నవ్వుతోనే ఔనంటారు బెనర్జీబాబు. బెనర్జీ: మాది స్పోర్ట్స్‌కు, అథ్లెటిక్స్‌కు పేరు పడ్డ ఏలూరు. చిన్నప్పటి నుంచి పరుగుతో పరిచయం ఉంది. అది తప్ప వేరే ప్రపంచం తెలీదు. స్కూల్ లెవెల్లో గ్రిగ్ చాంపియన్ని. 10సార్లు నేషనల్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రిప్రజెంట్ చేశాను. 1978లో స్పోర్ట్స్ కోటాలో వైజాగ్ పోర్టుట్రస్ట్లో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పుడూ పోటీల్లో పాల్గొనే వాడిని. ప్రాక్టీస్ తీవ్రంగా చేసేవాడిని. ఇరవై నాలుగ్గంటలూ మరో ధ్యాస ఉండేది కాదు. ఆటలకు పోర్ట్ జింఖానా గ్రౌండ్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. చాలా మంది అక్కడికి వచ్చేవారు. అలా అథ్లెట్‌గా ప్రాక్టీస్ కోసం వచ్చినప్పుడు బెర్నడెట్ని తొలిసారి చూశాను. బెర్నడెట్ : మాది వైజాగే. మా నాన్నగారు పోర్టు ఉద్యోగి. పోర్ట్ కాథలిక్ గర్ల్స్ హైస్కూల్లో చదివాను. నేను టెన్త్‌లో ఉండగా హ్యాండ్‌బాల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. అక్కడ స్టేట్ లెవెల్‌కు సెలక్ట్ అయ్యాను. 100మీ., 200మీ. పరుగుపందాల్లో స్టేట్ చాంప్‌ను అయ్యాను. వరుసగా పతకాలు రావడంతో అథ్లెటిక్స్ మీద ఆసక్తి కలిగింది. హ్యాండ్‌బాల్, పవర్‌లిఫ్టింగ్.. ఒకటేమిటి.. స్పోర్ట్స్ అంటే ప్రాణం పెట్టేసేదాన్ని. బెనర్జీ: పోర్టులో అథెటిక్స్‌లో పాల్గొనే ఉద్యోగులం 20 మంది జింఖానా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాళ్లం. 1980లో అక్కడికి నలుగురైదుగురు అమ్మాయిలు ప్రాక్టీస్ కోసం వచ్చేవారు. వారిని ఒక అమ్మాయి లీడ్ చేసేది. ఆమే బెర్నడెట్. అలా పోర్టు గ్రౌండ్లో మేము మొదటిసారి కలుసుకున్నాం. బెర్నడెట్ : అప్పట్లో కోచ్‌లు లేరు. సీనియర్లే మమ్మల్ని గైడ్ చేసేవారు. జింఖానా గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బెనర్జీ గైడ్ చేసేవారు. ఆయన మంచి అథ్లెట్‌గా తెలుసు. అమ్మాయిల్లో నేనే ఫస్ట్‌గా ఉండేదాన్ని. దాంతో నన్ను మరింతగా ప్రోత్సహించేవారు. అబ్బాయిలతో పోటీ పడి పరుగు తీసేదాన్ని. వాళ్లతో క్రాస్కంట్రీకి కూడా వెళ్లేదాన్ని. బెనర్జీ: అందరిలోనూ బెర్నడెట్ యాక్టివ్‌గా ఉండేది. ఎంత దూరమైనా మాతో విసుగు లేకుండా ప్రాక్టీస్ చేసేది. బాలికల విభాగంలో తను పాల్గొనని పోటీ లేదు. గెలవని పతకం లేదు. ఎన్సీసీలో సీనియర్ అండర్ ఆఫీసర్‌గా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొంది. చురుగ్గా ఉండేది. అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, పవర్‌లిఫ్టింగ్.. చాలా బిజీగా ఉండేది. స్టేట్ చాంపియన్. నేషనల్స్‌లో పాల్గొనేది. చొరవ, ధైర్యం తన సొంతం. వాళ్లమ్మగారు ఆంగ్లో ఇండియన్. దాంతో ఇంగ్లిష్ అదరగొట్టేసేది. దాంతో తనంటే ఇష్టం పెరిగింది. బెర్నడెట్ : ఏవీఎన్లో బీకామ్ అయిన తర్వాత పోర్టులో ఉద్యోగం వచ్చింది. 1984 ఏప్రిల్‌లో ఆయన పెళ్లి ప్రపోజల్ చేశారు. అప్పటికే నాలుగైదేళ్లుగా పరిచయం ఉంది. మంచి వ్యక్తి. ఆయనా అథ్లెట్ కావడంతో ఓకే అనేశా. బెనర్జీ: మా పెద్దలూ కాదనలేదు. 1984 జూన్‌లో మా వివాహం జరిగింది. తర్వాత ఇద్దరం అగర్తలాలోని నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏపీ తరపున పాల్గొన్నాం. కొంతకాలానికి నేను స్పోర్ట్స్ ఆఫీసర్ అయ్యాను. పెళ్లికి ముందు ఇద్దరం పోటాపోటీగా ఉండేవాళ్లం. పెళ్లయిన తర్వాత కూడా పోటీ ఉండేది. అవగాహన కూడా అదే స్థాయిలో ఉండేది. పెళ్లయిన కొత్తలో మా మాటలన్నీ పోటీలు, పార్టిసిపేషన్..ఇలా అథ్లెటిక్స్ చుట్టూనే ఉండేవి. బెర్నడెట్ : పెళ్లయిన తర్వాత అమ్మవాళ్ల క్వార్టర్స్ మాకు దగ్గరగానే ఉండడంతో ఇబ్బంది ఉండేది కాదు. పిల్లల్ని అమ్మ, మా అత్తగారు చూసుకునేవారు. పెళ్లి తర్వాత కూడా పోటీల్లో పాల్గొన్నా! బెనర్జీ: ఎంత మంచి స్పోర్ట్స్ పర్సనో అంత మంచి ఇల్లాలు. ఇంటి పనులన్నీ ఒంటి చేత్తో చేసేస్తుంది. ఇంటి నిర్వహణ, పిల్లల పెంపకం.. అన్నింటిలోనూ ఆమె పాత్రే ఎక్కువ. కూరగాయలు తెచ్చుకోవడంతో సహా అన్నీ తనే చేసుకుంటుంది. బెర్నడెట్ : ఈయన ఉదయం ఆరు గంటలకు కోచింగ్‌కు వెళ్లిపోతారు. 8.30కి వచ్చి మళ్లీ డ్యూటీకి వెళతారు. సాయంత్రం కూడా పిల్లలకు కోచింగ్‌తోనే ఆయనకు సరిపోతుంది. దాంతో అన్నీ నేనే చూసుకుంటాను. తను చాలా సపోర్ట్‌గా ఉంటారు. అందువల్లే నేను ఉద్యోగిగా, గృహిణిగానే కాదు.. నేషనల్ మీట్స్‌కు ఎనౌన్సర్, కంపీరర్గా, యూనియన్‌లో కీలక సభ్యురాలిగా, పోర్టులో విమెన్ కంప్లయింట్స్ సెల్ కన్వీనర్‌గా, ఇంటర్నేషనల్ మీట్స్‌లో టెక్నికల్ అఫీషియల్‌గా కొనసాగగలుగుతున్నాను. బెనర్జీ: మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు ప్రేమ్‌కుమార్ మెరైన్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. చిన్నవాడు ప్రణీత్ కుమార్ బీటెక్ తర్వాత ఎంబీఏ చేస్తున్నాడు. ప్రేమ్ బుచ్చిబాబు క్రికెట్ టోర్నీలో ఆడాడు. ప్రణీత్ రంజీ ప్రాబబుల్స్ వరకు వెళ్లాడు. బెనర్జీ: బెర్నడెట్ అథ్లెటిక్ చాంపియన్. గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా గర్వం మచ్చుకైనా కనిపించదు. చాలా అండర్‌స్టాండింగ్‌గా ఉంటుంది. నామాటకు ఎంతో విలువ ఇస్తుంది. బెర్నడెట్ : బయట బాధ్యతల ఒత్తిడితో కోపం తెచ్చుకున్నా కాసేపటికే నా దారిలోకి వచ్చేస్తారు. ఎలాగూ నామాటే ఆయన మాట కదా. ఏదన్నా ఇద్దరిదీ ఒకటే మాట. ఒకటే బాట.