‘సైదులు’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌ | Saidulu Movie Trailer To Release On 17th April | Sakshi
Sakshi News home page

‘సైదులు’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

Published Sun, Apr 10 2022 1:24 PM | Last Updated on Sun, Apr 10 2022 1:24 PM

Saidulu Movie Trailer To Release On 17th April - Sakshi

రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సైదులు’. కె.ఎమ్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై మరబత్తుల బ్రహ్మానందం నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబా పి.ఆర్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. ఆయనకిది తొలి చిత్రం. 1980లో తెలంగాణ నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించామని మేకర్స్‌ వెల్లడించారు.

హ‌క్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జ‌నం చేసిన తిరుగుబాటు నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. సీనియర్ నటుడు బెనర్జీ  ఓ కీలక పాత్రలో నటించడం సినిమాకు కలిసొచ్చిందని తెలిపారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూనిట్‌.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బీజీగా ఉన్నారు.మరోవైపు ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్‌ చేశారు. ఇందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ని ఏప్రిల్‌ 17న విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఫిలిం సెలబ్రిటీలు హాజరవుతారని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

(చదవండి: ‘ఆదిపురుష్‌’నుంచి స్పెషల్‌ వీడియో.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement