
సౌత్ ఇండియా సినిమాలతోపాటు హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు సీనియర్ ఆర్టిస్ట్ బెనర్జీ. సుమారు 400కుపైగా సినిమాల్లో యాక్ట్ చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'ఆచార్య' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ను తాను చేస్తానని వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
'చిరంజీవి చాలా మంచి మనిషి. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక వేదికపై చిరంజీవి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన అనుమతి తీసుకుని చిరంజీవిపై బయోపిక్ తీస్తే బాగుంటుందని, చిత్రపరిశ్రమలో ఆయన పడిన కష్టాలు, విజయాలు, అవార్డులు, రివార్డులతో సినిమా తీయగలిగితే అద్భుతంగా ఉంటుంది అని అన్నాను. కానీ నేనే ఆ బయోపిక్ తీస్తానని చెప్పలేదు. సోషల్ మీడియా వాళ్లు అలా ప్రచారం చేశారు.' అని బెనర్జీ చెప్పుకొచ్చారు.
చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్
Comments
Please login to add a commentAdd a comment