Sensor Programs
-
ఇది కల కాదు
నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇది కల కాదు’. అదీబ్ నజీర్, దానికా సింగ్, షఫీ, బెనర్జీ, వైభవ్ సూర్య, పూజిత జొన్నలగడ్డ ప్రధాన పాత్రల్లో నటించారు. అదీబ్ నజీర్ దర్శకత్వంలో పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సందర్భంగా అదీబ్ నజీర్ మాట్లాడుతూ– ‘‘స్త్రీలను దేవతలుగా కొలిచే మన దేశంలోనూ నేటి ఆధునిక కాలంలో వారిపై లైంగిక వేధింపులు జరగడం బాధాకరం. మన చుట్టుపక్కల జరుగుతున్న వాస్తవ సంఘటనలు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. దాదాపు రెండున్నర కోట్లు బడ్జెట్‌తో నిర్మించాం’’ అన్నారు సహ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రుబియా కౌ కాబ్. ఈ చిత్రానికి కెమెరా: వి. సత్యానంద్. -
పల్లెటూరు నేపథ్యంలో...
తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త జంటగా శివగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. అనిల్ కుమార్, కిషోర్, త్రినాథ్, శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ జరుపుకుంటోంది. ‘‘పల్లెటూరు నేపథ్యంలో సాగే యాక్షన్ కామెడీ చిత్రమిది. పూర్తి కమర్షియల్ హంగులతో ఉంటుంది. హీరో, విలన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు సంక్రాంతి కోళ్ల పందెంలా కనువిందు చేస్తాయి. 30 ఇయర్స్ పృథ్వీ చేసిన ఓ మేనరిజమ్ ప్రేక్షకుల్లో ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది’’ అన్నారు శివగణేశ్. ‘‘కొత్త కథ, కథనాలతో రూపొందిన చిత్రమిది. గీతామాధురి పాడిన ‘తిక్కరేగిన వంకరగాళ్లు’ పాటను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అజయ్ పట్నాయక్ సంగీతం, సాయిచరణ్ కెమెరా, ధర్మేంద్ర ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు అనిల్ కుమార్. -
ఈ షకీలా వేరు!
సెన్సేషనల్ స్టార్ షకీలా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శీలవతి’. సాయిరామ్ దాసరి దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో రాఘవ ఎమ్. మహేశ్, వీరు బాసింశెట్టి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ నెల 17న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. షకీలా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ఇది నా కెరీర్లో 250వ చిత్రం. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఉత్కంఠతను రేకెత్తించేలా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘సెన్సార్ ట్రబుల్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎదుర్కొని సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యాం. కేరళలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించాం. ఈ సినిమా చూశాక ఇంతకుముందు షకీలా వేరు ఈ సినిమా తర్వాత షకీలా వేరు అని ప్రేక్షకులు అంటారు. సాయిరామ్ బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. అర్జున్, గీతాంజలి, అశోక్, కొండ, తిరుపతి, చిన్నా తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. -
ఆ కాన్సెప్ట్ ఏంటి బంగారం..?
‘‘గాయాలతో ఆస్పత్రిపాలైన క్రిమినల్స్ బాధ చూసి ఏసీపీ కృష్ణ జాలిపడితే ఎటకారంగా చూశారు. సున్నితత్వానికి అమ్మమ్మలాంటి కృష్ణ క్యారెక్టర్లో సడన్‌గా మార్పు వచ్చింది. క్రిమినల్స్‌కి నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఈ మార్పుకి కారణం ఏంటి? అనడిగితే ‘బాబు బంగారం’ కాన్సెప్ట్ అంటాడు కృష్ణ. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి’’ అంటున్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వెంకటేశ్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికేట్ లభించింది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘జిబ్రాన్ స్వరపరిచిన పాటలు, ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. వెంకటేశ్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. వెంకటేశ్ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది’’ అన్నారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి డ్యాన్స్: బృంద, శేఖర్, స్టంట్స్: రవివర్మ, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ. -
ఆయుధపూజకు 10 ఎండ్రదుక్కుళ్
10 ఎండ్రదుక్కుళ్ చిత్రం విడుదల తేదీ ఖరారయ్యింది. విక్రమ్,సమంత జంటగా నటించిన చిత్రం 10 ఎండ్రదుక్కుళ్. ఇంతకు ముందు ఎంగేయుమ్ ఎప్పోదుమ్, రాజారాణి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఏఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. గోలీసోడా వంటి సంచలన విజయం సాధించిన చిత్ర సృష్టికర్త విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. చిత్ర టీజర్, పాటల ఇప్పటికే విడదలయ్యి మంచి స్పందన రాబట్టుకున్నాయని చిత్ర వర్గాలు తెలిపారు. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయని అన్నారు. ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు సమంత కూడా ఎంతో రిస్క్ తీసుకుని యాక్షన్ సన్నివేశాలల్లో నటించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 10 ఎండ్రదుక్కుళ్ చిత్రానికి యు సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు. చిత్రాన్ని ఆయుధపూజ(దసరా) సందర్భంగా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. కాగా తెలుగు,ిహ ందీ భాషల్లో వచ్చే నెల విడుదల చేయనున్నట్లు తెలిపారు.