ఆ కాన్సెప్ట్ ఏంటి బంగారం..? | Is Babu Bangaram the return of Bobbili Raja or Gharshana? | Sakshi
Sakshi News home page

ఆ కాన్సెప్ట్ ఏంటి బంగారం..?

Published Fri, Aug 5 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

ఆ కాన్సెప్ట్ ఏంటి బంగారం..?

ఆ కాన్సెప్ట్ ఏంటి బంగారం..?

‘‘గాయాలతో ఆస్పత్రిపాలైన క్రిమినల్స్ బాధ చూసి ఏసీపీ కృష్ణ జాలిపడితే ఎటకారంగా చూశారు. సున్నితత్వానికి అమ్మమ్మలాంటి కృష్ణ క్యారెక్టర్‌లో సడన్‌గా మార్పు వచ్చింది. క్రిమినల్స్‌కి నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఈ మార్పుకి కారణం ఏంటి? అనడిగితే ‘బాబు బంగారం’ కాన్సెప్ట్ అంటాడు కృష్ణ. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి’’ అంటున్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వెంకటేశ్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికేట్ లభించింది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘జిబ్రాన్ స్వరపరిచిన పాటలు, ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. వెంకటేశ్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. వెంకటేశ్ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది’’ అన్నారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి డ్యాన్స్: బృంద, శేఖర్, స్టంట్స్: రవివర్మ, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement