Ghibran
-
‘విశ్వరూపం 2’కు సెన్సార్ సమస్యలు
విశ్వరూపం 2 హిందీ వెర్షన్‌కు భారీగానే సెన్సార్ కత్తెరలు పడ్డట్టు తెలుస్తోంది. తమిళ, తెలుగు వెర్షన్లకు సెన్సార్ కార్యక్రమాలు గతంలోనే పూర్తయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు భాషల్లో విశ్వరూపం 2కు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ హిందీ వర్షన్‌కు మాత్రం సెన్సార్‌సభ్యులు 17 కట్స్ సూచించినట్టుగా తెలుస్తోంది. విశ్వరూపం తొలి భాగం రిలీజ్ కూడా సమస్యలు తలెత్తడంతో కమల్ కన్నీరు పెట్టుకోవల్సి వచ్చింది.ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం మంచి విజయం సాధించింది. తాజాగా విశ్వరూపం 2 విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికేట్ ఇవ్వాలని కొందరు, 17 కట్స్‌తో యు/ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మరికొందరు అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా నిర్మాత ఆర్థిక సమస్యల కారణంగా తప్పుకోవటంతో దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు కమల్ హసన్. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆ కాన్సెప్ట్ ఏంటి బంగారం..?
‘‘గాయాలతో ఆస్పత్రిపాలైన క్రిమినల్స్ బాధ చూసి ఏసీపీ కృష్ణ జాలిపడితే ఎటకారంగా చూశారు. సున్నితత్వానికి అమ్మమ్మలాంటి కృష్ణ క్యారెక్టర్లో సడన్‌గా మార్పు వచ్చింది. క్రిమినల్స్‌కి నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఈ మార్పుకి కారణం ఏంటి? అనడిగితే ‘బాబు బంగారం’ కాన్సెప్ట్ అంటాడు కృష్ణ. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి’’ అంటున్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వెంకటేశ్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికేట్ లభించింది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘జిబ్రాన్ స్వరపరిచిన పాటలు, ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. వెంకటేశ్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. వెంకటేశ్ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది’’ అన్నారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి డ్యాన్స్: బృంద, శేఖర్, స్టంట్స్: రవివర్మ, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ.