
విశ్వరూపం 2 హిందీ వెర్షన్‌కు భారీగానే సెన్సార్ కత్తెరలు పడ్డట్టు తెలుస్తోంది. తమిళ, తెలుగు వెర్షన్లకు సెన్సార్ కార్యక్రమాలు గతంలోనే పూర్తయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు భాషల్లో విశ్వరూపం 2కు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ హిందీ వర్షన్‌కు మాత్రం సెన్సార్‌సభ్యులు 17 కట్స్ సూచించినట్టుగా తెలుస్తోంది. విశ్వరూపం తొలి భాగం రిలీజ్ కూడా సమస్యలు తలెత్తడంతో కమల్ కన్నీరు పెట్టుకోవల్సి వచ్చింది.ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం మంచి విజయం సాధించింది.
తాజాగా విశ్వరూపం 2 విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికేట్ ఇవ్వాలని కొందరు, 17 కట్స్‌తో యు/ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మరికొందరు అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా నిర్మాత ఆర్థిక సమస్యల కారణంగా తప్పుకోవటంతో దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు కమల్ హసన్. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment