నాకలాంటి ఆలోచనే లేదు | I Am Ready To Do Any Type Of Role In Movies, Says Actress Andrea | Sakshi
Sakshi News home page

నాకలాంటి ఆలోచనే లేదు

Published Sun, Aug 4 2024 11:29 AM | Last Updated on Sun, Aug 4 2024 2:06 PM

I am Reday To Any Role in Movies: Andrea

నటిగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న భామ ఆండ్రియా. ఈమె పలాన పాత్ర అని కాకుండా నచ్చితే చాలు ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధం అంటారు. ఇప్పటికే కథానాయకిగానూ, ప్రతినాయకిగానూ నటించి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు వేశ్య పాత్రలోనూ మెప్పించిన ఆండ్రియా నిత్యం వార్తల్లో ఉండే రకం. తన గ్లామరస్‌ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరించే ఈమె పలు చిత్రాల్లో పాడిన పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఆండ్రియా బహుభాషా నటి. తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తున్నారు.

 సంగీత కచ్చేరిల్లోనూ తరచూ పాల్గొంటుంటారు. ప్రస్తుతం మాస్క్‌ చిత్రంలో నటుడు కవిన్‌తో కలిసి నటిస్తున్న ఆండ్రియా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ప్రస్తుతం కొత్తగా పాటలు పాడలేదని, త్వరలోనే మళ్లీ గాయనిగా అభిమానులను రంజింపజేస్తానని చెప్పారు. చారిత్రాత్మక కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారా? అని చాలా మంది అడుగుతున్నారన్నారు. అలాంటి ఆశ ఏమీ లేదని అన్నారు. తాను ఇప్పటికే ఈ రంగంలో కోరుకున్న థ్రిల్లర్, హార్రర్, ఎడ్వెంచర్, ప్రేమ క«థలు వంటి  పాత్రల్లో నటించేశానని చెప్పారు. వడచెన్నై చిత్రంలో మీరు నటించిన చంద్ర అనే పాత్రకు మంచి పేరు వచ్చింది. 

వడచెన్నై– 2 చిత్రాన్ని తెరకెక్కిస్తానని దర్శకుడు వెట్రిమారన్‌ చెప్పారని, అందులోనూ మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు ఆండ్రియా బదులిస్తూ ఆ విషయాన్ని దర్శకుడు వెట్రిమారన్‌ను అడగాలన్నారు. అయితే  వడచెన్నై– 2 చిత్రం తెరకెక్కితే అందులో చంద్ర పాత్రను తాను కచ్చితంగా పోషిస్తానని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. నటుడు విజయ్‌ రాజకీయ రంగప్రవేశం చేయడం గురించి మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు ఆయన రాజకీయ రంగప్రవేశం చేయడం చాలా సంతోషం అని, అయితే తనకు మాత్రం అలాంటి ఆలోచన లేదని నటి ఆండ్రియా చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement