Megastar's 'Bholaa Shankar' Movie Gets U/A Certificate From Censor Board - Sakshi
Sakshi News home page

Bhola Shankar Movie: మెగాస్టార్ భోళాశంకర్.. సెన్సార్ పూర్తి!

Published Wed, Aug 2 2023 8:50 PM | Last Updated on Thu, Aug 3 2023 9:00 AM

Megastar Bhola Shankar Movie Gets UA Certificate From Sensor Board - Sakshi

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ఈ చిత్రాన్ని తమిళంలో వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కించారు. 

(ఇది చదవండి: 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్)

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. భోళాశంకర్‌ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆగస్టు 11 నుంచి మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు భోళాశంకర్‌ సిద్ధమైంది అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

(ఇది చదవండి: 'భోళాశంకర్‌' ట్రైలర్‌ విడుదల ఎప్పుడంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement