Bhola Shankar Movie Update: Rashmi Gautham Special Song In Chiranjeevi Movie - Sakshi
Sakshi News home page

Rashmi Gautham In Bhola Shankar: బంఫర్‌ ఆఫర్‌ కొట్టేసిన రష్మీ.. మెగాస్టార్‌తో స్టెప్పులేయనుందా..?

Published Wed, Nov 24 2021 12:38 PM | Last Updated on Wed, Dec 8 2021 7:42 PM

Rashmi Gautham Special Song In Megastar Chiranjeevi Movie - Sakshi

Rashmi Gautham Special Song In Chiranjeevi Movie: జబర్ధస్త్‌ షో తో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు బుల్లితెరపైన దూసుకుపోతూ టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరిగా నిలిచింది. కెరీర్‌ మొదట్లో వెండితెరపై చిన్న పాత్రలతో ప్రేక్షకులకి పరిచయమైనప్పటికీ జబర్ధస్త్‌ షో ద్వారా టాలీవుడ్‌లో తనకంటూ నేమ్‌, ఫేమ్‌ని సంపాదించుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లుగా సమాచారం. (చదవండి: బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్‌ )

Rashmi Gautham

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకతే వేరు. అందులో మెగాస్టార్‌ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్‌ ఉన్న చిరు సినిమాలో రష్మీ గౌతమ్‌ ఓ సాంగ్‌ చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌.

Rashmi Gautham In Bhola Shankar Movie

శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న మాస్‌ సాంగ్‌లో రష్మికి  అవకాశం రావడం నిజంగా అదృష్టమేనని సినీ జనాలు అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే చిరు ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Rashmi Gautham Special Song In Bhola Shankar

(చదవండి: Chiranjeevi Upcoming Movies: చిరు స్పీడ్‌ మాములుగా లేదుగా.. 2022లో బిగ్గెస్ట్ మెగా ఫెస్టివల్! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement