
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
(ఇది చదవండి: కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?)
షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ మెగాస్టార్ ఎప్పటికప్పుడు తన ట్విటర్‌లో పంచుకుంటున్నారు. తాజాగా తమన్నాతో ఓ సాంగ్ షూటింగ్ సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. స్విట్జర్లాండ్‍లోని అందమైన లోకేషన్స్‌లో తీసిన సాంగ్ షూట్ ఎంతో ఆహ్లాదంగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న షూటింగ్ ఫోటోలను మెగాస్టార్ అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకొస్తా.. అప్పటివరకు 'చిరు లీక్స్' పిక్స్ నవ్వుతున్న ఏమోజీని జత చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ మీ పాట కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
(ఇది చదవండి: రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్‌డేట్)
స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది!
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 23, 2023
ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం !
అప్పటివరకూ ఈ 'చిరు… pic.twitter.com/VfT8Jx2QNC
Comments
Please login to add a commentAdd a comment