![కై పెక్కి..టవర్ పెకైక్కి.. ! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81439411830_625x300.jpg.webp?itok=PMKH9tr7)
కై పెక్కి..టవర్ పెకైక్కి.. !
మండల కేంద్రంలోని పలమనేరు రోడ్డులో మద్యం మత్తులో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. సుమారు 2 గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. స్థానికుల కథనం మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న నబీ కుమారుడు షఫీ(25) ఆటో డ్రైవర్. బుధవారం అతిగా మద్యం సేవించి సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. దూకేస్తానంటూ గట్టిగా కేకలు వేశాడు.
స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ శ్రీనివాసులు, ఇన్‌చార్జి తహశీల్దార్ మునిరాజ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమకు తెలిపితే వెంటనే పరిష్కరిస్తామని చెప్పినా అతను వినిపించుకోలేదు. చివర కు పోలీసులు టవర్ ఎక్కి అతన్ని సురక్షితంగా కిందకు తీసుకొచ్చి స్టేషను తీసుకెళ్లి విచారించారు. మద్యం మత్తులో పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు వారు తెలిపారు. - చౌడేపల్లె