బూడిద ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
కరీంనగర్ (రామగుండం): బూడిద ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఆటోనగర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆటోనగర్‌కు చెందిన షఫీ(38) రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆరాతీశారు. ఇంకా వివారలు తెలియ రావాల్సి ఉంది.