
దర్శక–నిర్మాతలతో తేజ
‘గీతాంజలి’ చిత్రంలోని ‘నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లోన’ పాట ఎంత సూపర్‌హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడా పాట ప్రస్తావన ఎందుకంటే.. ‘నందికొండ వాగుల్లోన’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. లక్కీ ఏకరీ, పూజశ్రీ జంటగా షఫీ, సాయికిరణ్ ముఖ్య తారలుగా సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సాయి వెంకట్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని దర్శకుడు తేజ విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నా వద్ద పనిచేసిన యువకులు చేసిన తొలి సినిమా పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నా మొదటి సినిమా ‘చిత్రం’ నాకెంత పేరు తెచ్చి పెట్టిందో...‘ నంది కొండ వాగుల్లోన’ సినిమా ద్వారా వీరు అంతకన్నా ఎక్కువ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మా గురువు తేజగారు మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి, మమల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు సత్యనారాయణ ఏకరీ. ‘‘ఈ నెల 25న పాటలు విడుదల చేసి, మార్చిలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత రఘు.హెచ్. లక్కీ ఏకరీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి.
Comments
Please login to add a commentAdd a comment