Pujasri
-
అర్జున్‌రెడ్డికి మించి...
షఫీ, లక్కీ ఏకరీ, సాయికిరణ్, పూజశ్రీ, మేఘన, జ్యోతికయాదవ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని, నవనీత్ స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకులు సాయి వెంకట్, షిరాజ్ మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో కంటే ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో బాగా ఆడుతుందని నమ్ముతున్నాం. మార్చి 2న సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ, థియేటర్ల బంద్ కారణంగా రిలీజ్ చేయడం లేదు. మంచి డేట్ చూసుకొని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమానా? అనుకోకండి. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యనారాయణ. ‘‘మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన సాయివెంకట్, ఆర్.కె. గౌడ్గార్లకు ధన్యవాదాలు’’ అని నిర్మాత రఘు అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆర్.కె. గౌడ్ పాల్గొన్నారు. -
నందికొండ వాగుల్లోన...
‘గీతాంజలి’ చిత్రంలోని ‘నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లోన’ పాట ఎంత సూపర్‌హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడా పాట ప్రస్తావన ఎందుకంటే.. ‘నందికొండ వాగుల్లోన’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. లక్కీ ఏకరీ, పూజశ్రీ జంటగా షఫీ, సాయికిరణ్ ముఖ్య తారలుగా సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సాయి వెంకట్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శకుడు తేజ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నా వద్ద పనిచేసిన యువకులు చేసిన తొలి సినిమా పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నా మొదటి సినిమా ‘చిత్రం’ నాకెంత పేరు తెచ్చి పెట్టిందో...‘ నంది కొండ వాగుల్లోన’ సినిమా ద్వారా వీరు అంతకన్నా ఎక్కువ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మా గురువు తేజగారు మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి, మమల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు సత్యనారాయణ ఏకరీ. ‘‘ఈ నెల 25న పాటలు విడుదల చేసి, మార్చిలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత రఘు.హెచ్. లక్కీ ఏకరీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి. -
నందికొండ వాగుల్లోన...
సాయికిరణ్, షఫి, పూజశ్రీ, జ్యోతిక యాదవ్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి రఘు నిర్మించారు. భరత్‌సింహా రెడ్డి సమర్పకుడు. నందికొండ వాగుల్లోన ఏం జరిగింది? ఎవర్నైనా మర్డర్ చేశారా? లేదా ప్రేమికులు హాలీడే ట్రిప్‌కు వెళ్లారా? లేక అక్కడేమైనా మిస్టరీ దాగుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ‘‘సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. లవ్, సెంటిమెంట్, కామెడీలతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీతాచారి. -
శిల్పాశెట్టి నాకు ఆదర్శం
యోగా.. సిటీలో ఇప్పుడు ఆరోగ్యమంత్రం ఇదే. ప్రపంచానికే ఆరోగ్య సూత్రాలను నేర్పిన మనదేశం లేటుగానైనా లేటెస్టుగా దూసుకుపోతోంది. బాలీవుడ్ అగ్రనటి శిల్పాశెట్టి యోగా వీడియోలు ఆ మధ్య ఓ సంచలనమే అయ్యాయి. అవి చూసిన మోడల్స్, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు సైతం యోగా బాట పట్టారు. యోగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ఆరోగ్యం బాగుంటుంది.. అంటోంది వర్ధమాన తార పూజశ్రీ. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నాకు ఆదర్శం. ఆమె యోగా చేయడం వల్ల మంచి అందంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా యోగా చేస్తున్నాను. రాందేవ్ బాబా వద్ద యోగా నేర్చుకున్నాను. తొమ్మిదేళ్లుగా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నాను. దీనివల్ల చాలా లాభాలు చూస్తున్నాను. నటిగా సినిమా షూటింగ్స్‌లో కొన్ని టేక్‌లు పదేపదే చేయాల్సి వస్తుంది. యోగా వల్ల ఎంత ఒత్తిడి ఉన్నా దరిచేరదు’. అలా నటినయ్యా.. ‘మోడలింగ్ చేస్తున్న సమయంలో ఫొటోషూట్స్ చూసి తమిళంలో ‘ఉల్గా మగా కదల్’ సిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత టాలీవుడ్లో ‘ముసుగు’ చిత్రంలో అవకాశం వచ్చింది. బాలీవుడ్లో హీరోయిన్ ఒరి యంటెడ్ మూవీ ‘లీడర్ ది లయన్’ చేయబోతున్నా. దీంతో పాటు మరిన్ని సినమాలను ఓకే చేశా. అవి త్వరలో పట్టాలెక్కనున్నా యి. ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్‌లో ఉంటున్నారు. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం ఓ పదినిమాషాలైనా యోగా చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి’ అంటూ ముగించింది. నగరంలో యోగా శిబిరాలు... రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ఉదయం 7.15 నుంచి 8.30 వరకు..ముఖ్య అతిథి గవర్నర్ నరసింహన్బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో ఉదయం 7 గంటలకు, ముఖ్యఅతిథి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బీజేపీ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కులో ఉదయం 6.30 గంటలకు సికింద్రాబాద్ ఆర్ఏసీ గ్రౌండ్స్‌లో ఉదయం 6.15 గంటలకు.. ముఖ్య అతిథి దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు 3000 మందిచే యోగా ఆర్యప్రతినిధి సభ ఆధ్వర్యంలో కుందన్‌బాగ్‌లోని ఆర్యసమాజ వైదిక ఆశ్రమ కన్యగురుకుల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో ఉదయం 6 గంటలకు – చైతన్య వంపుగాని