శిల్పాశెట్టి నాకు ఆదర్శం
యోగా.. సిటీలో ఇప్పుడు ఆరోగ్యమంత్రం ఇదే. ప్రపంచానికే ఆరోగ్య సూత్రాలను నేర్పిన మనదేశం లేటుగానైనా లేటెస్టుగా దూసుకుపోతోంది. బాలీవుడ్ అగ్రనటి శిల్పాశెట్టి యోగా వీడియోలు ఆ మధ్య ఓ సంచలనమే అయ్యాయి. అవి చూసిన మోడల్స్, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు సైతం యోగా బాట పట్టారు. యోగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ఆరోగ్యం బాగుంటుంది.. అంటోంది వర్ధమాన తార పూజశ్రీ. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
‘బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నాకు ఆదర్శం. ఆమె యోగా చేయడం వల్ల మంచి అందంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆమెను చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను కూడా యోగా చేస్తున్నాను. రాందేవ్ బాబా వద్ద యోగా నేర్చుకున్నాను. తొమ్మిదేళ్లుగా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నాను. దీనివల్ల చాలా లాభాలు చూస్తున్నాను. నటిగా సినిమా షూటింగ్స్‌లో కొన్ని టేక్‌లు పదేపదే చేయాల్సి వస్తుంది. యోగా వల్ల ఎంత ఒత్తిడి ఉన్నా దరిచేరదు’.
అలా నటినయ్యా..
‘మోడలింగ్ చేస్తున్న సమయంలో ఫొటోషూట్స్ చూసి తమిళంలో ‘ఉల్గా మగా కదల్’ సిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత టాలీవుడ్‌లో ‘ముసుగు’ చిత్రంలో అవకాశం వచ్చింది. బాలీవుడ్‌లో హీరోయిన్ ఒరి యంటెడ్ మూవీ ‘లీడర్ ది లయన్’ చేయబోతున్నా. దీంతో పాటు మరిన్ని సినమాలను ఓకే చేశా. అవి త్వరలో పట్టాలెక్కనున్నా యి. ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్‌లో ఉంటున్నారు. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం ఓ పదినిమాషాలైనా యోగా చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి’ అంటూ ముగించింది.
నగరంలో యోగా శిబిరాలు...
రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో ఉదయం 7.15 నుంచి 8.30 వరకు..ముఖ్య అతిథి గవర్నర్ నరసింహన్‌బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో ఉదయం 7 గంటలకు, ముఖ్యఅతిథి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బీజేపీ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కులో ఉదయం 6.30 గంటలకు సికింద్రాబాద్ ఆర్‌ఏసీ గ్రౌండ్స్‌లో ఉదయం 6.15 గంటలకు.. ముఖ్య అతిథి దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు 3000 మందిచే యోగా ఆర్యప్రతినిధి సభ ఆధ్వర్యంలో కుందన్‌బాగ్‌లోని ఆర్యసమాజ వైదిక ఆశ్రమ కన్యగురుకుల్‌లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో ఉదయం 6 గంటలకు
– చైతన్య వంపుగాని