
నందికొండ వాగుల్లోన...
సాయికిరణ్, షఫి, పూజశ్రీ, జ్యోతిక యాదవ్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి రఘు నిర్మించారు. భరత్‌సింహా రెడ్డి సమర్పకుడు. నందికొండ వాగుల్లోన ఏం జరిగింది? ఎవర్నైనా మర్డర్ చేశారా? లేదా ప్రేమికులు హాలీడే ట్రిప్‌కు వెళ్లారా? లేక అక్కడేమైనా మిస్టరీ దాగుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ‘‘సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. లవ్, సెంటిమెంట్, కామెడీలతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీతాచారి.