దండేపల్లి: దండేపల్లి మండల కేంద్రానికి చెందిన పెండ్యాల సత్యనారాయణ–శకుంతల కుమారుడు పెండ్యాల సాయికిరణ్ మూడు ఉద్యోగాలు సాధించాడు. సాయికిరణ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, మహారాష్ట్రలోని దపోలీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాడు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ, గ్రూప్–4, ఇండియన్‌బ్యాంక్, మండల వ్యవసాయ అధికారి ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు.. ఇందులో గ్రూ ప్–4లో జిల్లా 14వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇండియన్ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల విడుదలైన మండ ల వ్యవసాయ అధికారి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యా డు. సాయికిరణ్ మూడు ఉద్యోగాలకు ఎంపికవ్వడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏవో ఉద్యోగానికి ఎంపిక..
జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన జాడి రాజలింగం–రేణుక దంపతుల కూతురు స్పందన మండల వ్యవసాయ అధికారి ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెను జగిత్యాల డిప్యూటీ కలెక్టర్ చిత్రుపటేల్ ఆదివారం పొనకల్‌లో అభినందించా రు. 2022లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన స్పందన, 2023 జనవరిలో భారత ఆహార సంస్థ నిర్వహించిన ఉద్యోగ పరీక్షలో టెక్నికల్ అసెస్టింట్ ఉద్యోగం సాధించి మంచిర్యాలలో ఉద్యోగం చేస్తున్నారు.
2023 మేలో నిర్వహించిన మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగ పరీక్షల ఫలితాలు తాజా గా విడుదల కాగా ఏవో ఉద్యోగం సాధించింది. తమ కూతురు ప్రభుత్వ కొలువులు సాధించినందుకు సంతోషంగా ఉందని స్పందన తల్లిదండ్రులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment