విలేకరిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దాడి | mla jaleel khan attack on reporter in vijayawada | Sakshi
Sakshi News home page

విలేకరిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దాడి

Published Sat, Apr 23 2016 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

విలేకరిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దాడి

విలేకరిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దాడి

► ఫోన్ ధ్వంసం..జైల్లో పెట్టిస్తానని బెదిరింపు
► ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు


విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ తన రౌడీయిజాన్ని మరోసారి ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి నగరానికి చెందిన ఓ విలేకరిపై భౌతికదాడికి దిగారు.

వివరాల్లోకి వెళ్లితే.. తారాపేటలోని జలీల్‌ఖాన్ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో మసీదు, గోరీలదొడ్డి (ముస్లిం శ్మశానవాటిక) చాలా భాగం నష్టపోనుంది. ఈ నేపథ్యంలో గోరీలదొడ్డి కమిటీ, స్థానిక ముస్లిం ప్రముఖులు గోరీలదొడ్డి వద్ద శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. తనకు చెప్పకుండా  సమావేశం పెట్టుకోవడమేమిటని జలీల్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడకు చేరుకున్నారు. అందరినీ బూతులు తిట్టడం ప్రారంభించారు.

అటుగా వెళ్తున్న ప్రెస్‌క్లబ్ కోశాధికారి, కాకతీయ పత్రిక సంపాదకుడు షఫీ.. గమనించి లోపలకు వెళ్లారు. సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయసాగారు. దాంతో జలీల్‌ఖాన్ ఒక్కసారిగా రెచ్చిపోయి ‘ఎవడ్రా ఫోటోలు తీస్తోంది.. వాడిని కుమ్మండ్రా’ అంటూ తన అనుచరులను ఆదేశించారు. జలీల్‌ఖాన్ అనుచరులు షఫీపై దాడికి పాల్పడ్డారు. ఫోన్‌ను ధ్వంసం చేశారు. జలీల్‌ఖాన్‌తో షఫీ మాట్లాడబోగా.. ‘ఎక్కువ మాట్లాడకు.. జైలులో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’ అంటూ చిందులుతొక్కారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్‌ షఫీపై జరిగిన దాడిని జిల్లా మైనార్టీ జర్నలిస్ట్ అసోషియేషన్ తీవ్రంగా ఖండించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement