
నటి హేమ ఇంద్రకిలాద్రి అమ్మవారిని మంగళవారం దర్శంచుకున్నారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్‌పై ఆమె ఫైర్ అయ్యింది. నటి హేమ అమ్మవారి భక్తురాలు అనే విషయం తెలిసిందే. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఆమె ఇంద్రకిలాద్రి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఆమె అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు.
చదవండి: బిగ్‌బాస్ 6లోకి సుడిగాలి సుధీర్? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లో హంగామా!
ఇక దర్శనం అనంతరం ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘అందరికి నమస్కారం. నేను మీ హేమను. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ప్రోటోకాల్ ఇబ్బంది అని, చాలా మంది జనాలు పోటేత్తి వస్తున్నారన్నారు. దీంతో ఈ ఏడాది రాలేనేమో అనుకున్నా. కానీ, అమ్మవారే ఈ రోజు నన్ను ఇక్కడికి రప్పించారు. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు చాలా పుణ్యం చేసుకున్నారు. మీ అందరికి కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నాను’ అన్నారు.
చదవండి: Prabhas Adipurush Teaser: కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్.. బద్దలుకొట్టిన ఆదిపురుష్
ఈ క్రమంలో ఓ రిపోర్టర్ టికెట్స్ తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించగా.. సహనం కోల్పోయిన ఆమె అతనిపై సీరియస్ అయ్యారు. ‘మేం ఇద్దరం వచ్చాం. హుండీలో పది వేలు వేశాను. అమ్మవారికి 20 వేలు పెట్టి చీర తెచ్చాను. మీరు టికెట్ గురుంచి మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతున్నాం. దీన్ని కాంట్రవర్శి చేయడం సరికాదంటూ’ అతడిపై మండిపడ్డారు. అంతేకాదు తాను భక్తి కోసం వచ్చానని, కాంట్రవర్సికోసం కాదంటూ ఘాటుగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment