MLA Jaleel Khan
-
జలీల్‌ఖాన్‌కు ఝలక్!
సాక్షి, విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు సీఎం ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఆశపడి, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి పచ్చ కండువా కప్పుకున్నా ఆశించిన ప్రయోజనం దక్కని పరిస్థితి ఎదురైంది. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి చుట్టూ పలుమార్లు కాళ్లరిగేలా తిరిగారు. మంత్రి వర్గ విస్తరణ సమయం ఆసన్నమవ్వడంతో మైనార్టీ కోటాలో మంత్రి పదవి పొందేందుకు శనివారం ఉండవల్లిలో మరోసారి ముఖ్యమంత్రిని కలిశారు. మంత్రి పదవి పొందుతున్న ఎన్ఎండీ ఫరూక్ కంటే తాను సీనియర్‌నని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అందువల్ల తనకే మంత్రి పదవి ఇవ్వాలంటూ సీఎం వద్ద పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఫరూక్ పేరు ఖరారు చేశామని, ఇద్దరు మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యపడదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అలిగినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని, కనీసం బుజ్జగించే ప్రయత్నాలు కూడా బాబు చేయరని భావిం చిన జలీల్ మౌనంగా ఇంటిదారి పట్టినట్టు తెలుస్తోంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా వివాదాస్పద నిర్ణయాలు మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా, ఇక మంత్రివర్గ విస్తరణ ఉండదు. జలీల్‌ఖాన్ వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు మంత్రి పదవి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదంటూ జలీల్‌ఖాన్ సరిపుచ్చుకుంటున్నారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్లే ముఖ్యమంత్రి ఆయన్ను దూరంగా పెడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలను ముస్లిం మత పెద్దలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాళేశ్వరరావు మార్కెట్ ఎదురుగా ఉన్న జమ్మా మసీద్ వక్ఫ్ భూమిని ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. భవానీపురంలో మరో భూమి విషయంలోనూ ఆయనకు చుక్కెదురైంది. జలీల్‌కు మంత్రి పదవి వస్తే పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోయేదని ఆయన నియోజకవర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూ.. జలీల్‌ఖాన్ మాట్లాడే విధానమే ఆయన్ను ఇబ్బందుల్లో పడవేస్తోందని, అదే మంత్రి పదవికి దూరం చేసిందని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పడంతో ఆయన నవ్వులపాలయ్యారు. పార్టీ మారినందుకు చంద్రబాబు డబ్బులు ఇస్తామని చెప్పినా తాను తీసుకోలేదంటూ బహిరంగంగా చెప్పడం ద్వారా చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని చెప్పకనే చెప్పారు. ఈ వీడియో రాష్ట్రమంతా వైరల్ అయ్యింది. దీనికి తోడు పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల్నే ఆయన కలుపుకొని ముందుకు వెళ్లడం లేదు. ఆయన నోటి దురుసుతనం వల్ల తన ప్రతిష్టతో పాటు పార్టీ పరువు తీస్తున్నందున చంద్రబాబు ఆయనకు మంత్రి పదవికి దూరంగా ఉంచారని నియోజకవర్గంలోని పలువురు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మూడు పార్టీలు మారినా.. జలీల్‌ఖాన్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయనకు రాజకీయ జీవితం ప్రసాదించి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్రతోనే ఆయన విభేదించారు. నాటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి పార్టీకి దూరమయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరినా ప్రయోజనం లేకపోయింది. రాజకీయ జీవితం ముగిసిపోయిందన్న దశలో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆయనకు పశ్చిమ నియోజకవర్గ సీటు ఇచ్చి గెలిపించారు. అయితే మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించినా ఫలితం మాత్రం దక్కలేదు. -
విజయవాడ వించిపేటలో ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : నగరంలోని వన్ టౌన్ వించిపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనారిటీలకు చెందిన పవిత్రమైన పీర్ల సావడి స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రయత్నించిన బాగోతం బయటపడింది. పీర్ల సావడి స్థలం నుంచి పీర్లకు సంబంధించిన సామగ్రిని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అనుచరులు బయటపడేసి దౌర్జన్యానికి దిగారు. అంతేకాకుండా ఈ స్థలంలో మాంసం దుకాణాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాన్ని, కబ్జాయత్నాన్ని వ్యతిరేకిస్తూ పీర్ల సావడి వద్ద ముస్లింలు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో కబ్జాలు పెరిగిపోయాయని, తాజాగా పవిత్రమైన ముస్లింల ప్రదేశాన్ని కూడా టీడీపీ నేతల అండగా కబ్జా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ముస్లిం నేతలు, ముస్లిం ప్రజలు పీర్ల సావడి కబ్జాయత్నంపై భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నగరంలోని ఖాళీ ప్రదేశాలపై కన్నేసి.. కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు. -
ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తా..
సాక్షి, వించిపేట (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్.. మహిళా కార్పొరేటర్‌పై దౌర్జన్యానికి దిగారు. ప్రొటోకాల్ ప్రకారం డివిజన్లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యేనో, ఆ డివిజన్ కార్పొరేటరో ప్రారంభించాల్సి ఉండగా, మరో డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వెంట తీసుకొచ్చి వారిచేత ప్రారంభింపజేశారు. దీనిపై నిలదీసిన మైనార్టీ మహిళా కార్పొరేటర్‌పై జలీల్‌ఖాన్ దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. విజయవాడ 36వ డివిజన్ పరిధిలోని వించిపేట నైజాంగేటు సెంటర్లో రూ.30 లక్షలతో సీసీ, బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ప్రొటోకాల్ పాటించకుండా మైనార్టీ కార్పొరేటర్ జాన్‌బీ పక్కనుండగానే ఆయన అనుచరులైన మరో డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్తల చేత కొబ్బరికాయలు కొట్టించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. కార్పొరేటర్ జాన్‌బీ అడ్డుకుని ప్రొటోకాల్‌పై నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన జలీల్‌ఖాన్ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, అడగడానికి నువ్వెవరు.. నా కాళ్లు పట్టుకుంటే నీకు సీటు ఇప్పించా.. ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తానంటూ.. ఆమెపై దాడికి యత్నించారు. తనకు తెలియకుండా డివిజన్లో అభివృద్ధి పనులు జరగొద్దని అధికారులకు హుకుం జారీచేశారు. జాన్‌బీ మాట్లాడుతూ.. ఓట్లు వేసే వారికి మీరు పని చేయరా? ఓ ఎమ్మెల్యే మాట్లాడే మాటలా ఇవి? ప్రజలు చూస్తున్నారు. ఆడవారితో మాట్లాడే పద్ధతి ఇదా? మీ ఇంటికి చేస్తున్నావా? మా ఇంటికి చేస్తున్నావా?.. అంటూ జలీల్‌ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచి వించిపేట నైజాంగేటు సెంటర్ నుంచి ఫోర్‌మెన్ బంగ్లా వరకు రోడ్లు గోతులుపడిపోయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీనిపై అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగానన్నారు. కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టడంతో నగరపాలక సంస్థ ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభించామన్నారు. 36వ డివిజన్లో వైఎస్సార్సీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉనికిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే.. డివిజన్లో అభివృద్ధి పనులు చెయ్యొద్దంటూ అధికారులను ఆదేశించడం నీచమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని త్వరలో ప్రభుత్వానికి, ఆ నాయకులకు తగిన బుద్ధి చెబుతారన్నారు.. -
నవ్వుపుట్టిస్తోన్న టీడీపీ తురుపుముక్కలు
- హస్తం గుర్తుకు ఓటేయాలన్న జలీల్ ఖాన్! - చెప్పుకోవడానికేమీలేక కమెడియన్లతో షో నడిపిస్తోన్న చంద్రబాబు నంద్యాల: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నంద్యాలలో పార్టీల ప్రచారం మరింత ఉధృతంగా సాగుతోంది. కాగా, అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టీడీపీ తురుపుముక్కలు.. స్థానిక ప్రజలకు ఒకింత హాస్యాన్ని పంచుతున్నారు. ‘బీకాంలో ఫిజిక్స్’ చదివిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. అయితే టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ‘హస్తం గుర్తుకు ఓటేయండ’ని జలీల్ కోరడంతో అక్కడున్న జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారని తెలిసింది. బాబు షో: శనివారం నంద్యాలలో రోడ్ షో నిర్వహించిన సీఎం చంద్రబాబు వేణుమాధవ్ తదితర కమెడియన్లను వెంటపెట్టుకురావడం తెలిసిందే. అయినంతలో వాళ్లు కూడా హాస్యాన్ని పండించే ప్రయత్నం చేయగా, ప్రజలు మాత్రం టీడీపీ తీరుపై పెదవివిరిచారు. ‘‘మూడున్నర ఏళ్లలో ప్రజలను మోసం చెయ్యడం తప్ప చంద్రబాబు చేసిందేమీలేదు. అందుకే చెప్పుకోవడానికి ఏమీలేక కమెడియన్లతో షో చేస్తున్నారు’’ అని జనం బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆగస్టు 23న నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. -
మామూళ్ల వివరాలివ్వండి: ఎమ్మెల్యే
వక్ఫ్‌బోర్డు అధికారులను బెదిరించిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సాక్షి, అమరావతి: వక్ఫ్‌బోర్డుకు కాబోయే చైర్మన్‌ను నేనే.. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకు ఎంత మామూళ్లు ఇచ్చారు.. ఆదాయం, ఖర్చు వివరాలు చెప్పండి అంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వక్ఫ్‌బోర్డు అధికారులను బెదిరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో తాను సూచించిన వారిని ముతవల్లీలుగా గెలిపించాలని, లేకుంటే అందుకు సహకరించని అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. వక్ఫ్‌బోర్డుకు ఎలాంటి సంబంధంలేని ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడటం ఏమిటని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతోనే తేల్చుకుంటామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ల సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి హాజరవుతానని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వక్ఫ్‌బోర్డు అధికారులకు ముందుగా సమాచారం ఇచ్చారు. అయితే వక్ఫ్‌బోర్డులో ఏ హోదా లేకుండా సమావేశానికి హాజరవడానికి వీలులేదని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. అయితే ఎమ్మెల్యే భోజనాలు ఏర్పాటు చేయడంతో ఇన్స్పెక్టర్లతోపాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బెదిరింపులకు దిగడంతో అధికారులు ఖంగుతిన్నారు. అంతేకాకుండా కర్నూలు, విజయవాడలకు చెందిన ఖాజా, ఇంతియాజ్ అనే వ్యక్తులను పరిచయం చేస్తూ ఆయా ప్రాంతాల్లో వీరు ముతవల్లీలుగా పోటీ చేయనున్నారని, వీరిని గెలిపించే బాధ్యత మీదే అంటూ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులకు సూచించారు. అందుకు సహకరించని వారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వక్ఫ్‌బోర్డులో ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ముతవల్లీలు, ఒక న్యాయవాది ఇతరులను సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ లేకపోవడంతో వైఎస్సార్ సీపీ నుంచి వలసలు వచ్చిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు వక్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకుండా నాన్చుతూ వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జలీల్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు
-
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జలీల్‌ఖాన్
విజయవాడు: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 27ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఈ 27ఏళ్లలో జాతీయ పార్టీ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పార్టీలకు అధ్యక్షుడిగా పనిచేశానని జలీల్ ఖాన్ అన్నారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున మూడు నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానాల్లో అందరు అభ్యర్థులు ఓడిపోయినా తాను గెలిచానని గుర్తు చేసుకున్నారు. ఈ సారి వైఎస్సార్సీపీ తరపున గెలిచినా అభివృద్ధి కోసమే తిరిగి తెలుగుదేశంలో చేరానని చెప్పారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు 12శాతం ఉన్నారని నంద్యాల నుంచి మొదలుపెడితే కడప, రాయచోటి నుంచి ముస్లింలను తెలుగుదేశానికి ఓట్లు వేయిస్తాన్నారు. చంద్రబాబునాయుడుని నమ్మి పార్టీలోకి వచ్చానని, తన జీవితం ముఖ్యమంత్రి చేతుల్లో ఉందని జలీల్‌ఖాన్ అన్నారు. ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. గతంలో జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఆసమయంలో 'ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి బీకామ్ డిగ్రీ సాధించా'నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఖాన్ 'బీకామ్ ఫిజిక్స్' వ్యాఖ్యలపై చాలా మంది పొట్టచక్కలయ్యేలా నవ్వుకున్నారు. -
బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా..
పార్టీ మీటింగ్‌లో బిజీగా ఉన్నాడు చంద్రబాబు. లోకేష్ వచ్చి గుసగుసగా చంద్రబాబు చెవిలో చెప్పాడు. ‘నాన్నగారూ.. మీరు చెప్పినట్టే అంతా రెడీ చేశాను. పక్క రూంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వెయిటింగ్..’‘వస్తున్నా, పద..’ అన్నాడు చంద్రబాబు.చంద్రబాబు ఏం చెప్పాడు? ఎమ్మెల్యేలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇది తెలియాలంటే ఓ రోజు వెనక్కి వెళ్లాలి.ముందురోజు సాయింత్రం.. మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి కూర్చున్నాడు లోకేష్ బాబు. అతడి గెడ్డం పుచ్చుకుని బతిమాలుతున్నాడు చంద్రబాబు. ‘చూడు నాన్నా.. నువ్వలా మూతి బిగించుకు కూర్చుంటే ఎలా చెప్పు.. ఫేసు మరీ దరిద్రంగా ఉంటుంది.. సమయం చూసుకుని నిన్ను మినిస్టర్‌ని చేస్తానుగా.. కాస్త ఓపిక పట్టు ..‘గంయ్ మన్నాడు లోకేష్. ‘ఏంటి ఇంకా ఓపిక పట్టేది .. ఏడాది నించి అడుగుతూనే ఉన్నా.. అదుగో, ఇదిగో అంటూ నానబెడుతున్నారు. అవతల పుణ్యకాలం మించిపోతోంది. అటుచూస్తే, కేటిఆర్ మంత్రయిపోయి, బుగ్గ కారులో ఝామ్మని తిరిగేస్తూ, కాబోయే సీఎమ్‌గా పేరు తెచ్చేసుకుంటున్నాడు. నేనిక్కడ పార్టీ మీటింగుల్లో తిరుగుతూ ఇలా అఘోరిస్తున్నాను. మీరు చూస్తే మంత్రివర్గ విస్తరణకి రెడీ అయిపోతున్నారు. నా ఊసే ఎత్తరాయే..’ వెక్కుతూ అన్నాడు లోకేష్.చంద్రబాబు పితృ హృదయం పగిలి ముక్కలైంది. ఏరుకుని అతికించుకుంటూ లాలనగా చెప్పాడు. ‘నీకన్నా నాకెవరు ఉన్నారు లోకేష్ బాబూ.. కొంచెం ఓపిక పట్టు , అంతే..! నిన్ను కేటిఆర్ బాబు లెవెల్‌కి తీసుకుపోతా.. అంతకన్నా ప్రత్యేక హోదా కల్పిస్తా..!’ ప్రత్యేక హోదా మాట వినగానే పుచ్చిపోయిన పల్లీ నమిలిన వాడిలా మొహం పెట్టాడు లోకేష్. ‘ఆ ఒక్క మాట అనకండి నాన్నా.. మీకు పుణ్యం ఉంటుంది..’ చేతులు జోడించాడు.‘చిలిపి..’ కిసుక్కున నవ్వాడు చంద్రబాబు.‘అయినా మీకు నా సత్తా ఇంకా అర్థం కావడం లేదు నాన్నగారూ.. నన్నింకా ఎన్నేళ్లు ఓపిక పట్టమంటారు చెప్పండి..’‘ సరే.. ఒక పని చేస్తా.. నువ్వొక ఇద్దరు ఎమ్మెల్యేలని పట్టుకు రా.. అచ్చంగా నీ మనుషుల్నే తీసుకు రా.. ఆ ఇద్దర్నీ మంత్రులుగా తీసేసుకుంటాను.. వాళ్లెవరైనా నాకు ఓకే.. ’ రాజీ మార్గం సూచించాడు చంద్రబాబు. ‘చావుకి పెడితే లంఖనాలకి దిగొచ్చింది’ అని మనసులో అనుకుంటూ, ‘ రేపు సాయింత్రం కల్లా రెడీ చేస్తాను నాన్నగారూ’ అన్నాడు లోకేష్.‘ముందు వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడతా.. కేవలం ఫార్మాలిటి..అంతే ..’ చెప్పాడు చంద్రబాబు.తలూపి వెళ్లిపోయాడు లోకేష్. మీటింగ్‌లోంచి లేచి వెళ్లి తన రూంలో కూర్చున్నాడు చంద్రబాబు.లోకేష్ ఒక ఎమ్మెల్యేని లోపలికి పంపాడు.ఆ ఎమ్మెల్యే వస్తూనే బాబు కాళ్ల మీద పడిపోయే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు పరేంగితజ్ఞుడు. చటుక్కున కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. వచ్చిన ఎమ్మెల్యే మరింత పరేంగితజ్ఞుడు. రుద్ద కంఠంతో చెప్పాడు.‘ సార్.. సార్.. మీరు పొరబాటు పడుతున్నారు. నేను మీ కాళ్లు పట్టుకుని మిమ్మల్ని కుర్చీలోంచి లాగేస్తాననుకుంటున్నారేమో.. నా ఉద్దేశం అది కాదు సార్.. తనివితీరా మీ కాళ్లకు దండం పెట్టుకుందామని.. అంతే..అంతే..’చంద్రబాబు మొహం గంటు పెట్టుకుని ఆ ఎమ్మెల్యేని కూర్చోమన్నట్టు గంభీరంగా సైగ చేశాడు. ఎమ్మెల్యే కిక్కురుమనకుండా కూర్చున్నాడు. ‘సరే .. పాయింటుకి వచ్చేద్దాం.. నీకు మినిస్టర్ పోస్టు ఇవ్వాలని మా లోకేషు రికమెండ్ చేశాడు’ అన్నాడు చంద్రబాబు. ఎమ్మెల్యే మెలికలు తిరిగిపోతూ ‘చిత్తం .. చిత్తం’ అన్నాడు. చంద్రబాబు చిరాగ్గా చూసి చెప్పాడు. ‘ముందా మెలికల్ని స్ట్రెయిట్ చేసి తిన్నగా కూర్చుని నేను అడిగిందానికి స్టెయ్రిట్ గా సమాధానం చెప్పు’.ఎమ్మెల్యే బిక్క మొహం పెట్టి ‘అలాగే సార్’ అన్నాడు.చంద్రబాబు గొంతు సవరించుకుని అన్నాడు.. ‘ఇప్పుడు మన కేబినెట్ ఎలాంటి కేబినెట్ అనుకున్నావు? మన మంత్రులందరూ మేలిమి ముత్యాలు.. కోహినూర్ వజ్రాలు అనుకో.. నిన్ను తీసుకుంటే నువ్వు వాళ్లతో సరి సమానంగానయినా ఉండాలి.. లేదా ఓ మెట్టు ఎక్కువైనా ఉండాలి.. ఇప్పుడు చెప్పు’ఎమ్మెల్యే వినయంగా చేతులు కట్టుకుని ‘మన మంత్రులకి నేను ఏమాత్రం తీసిపోను గానండి .. మీరేం అనుకోకపోతే ఒక్క మాటండి..’‘చెప్పవోయ్ పర్వాలేదు ..’ భరోసా ఇచ్చాడు చంద్రబాబు. ‘మన మంత్రుల్ని విమర్శించడం కాదు గాని పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్లెవరూ సరిగ్గా స్పందించడం లేదని నాకనిపిస్తోందండి ..’చంద్రబాబు గెడ్డం గోక్కుంటూ ‘ఏంటా కష్ట కాలం? చెప్పు’ అన్నాడు.ఎమ్మెల్యే అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి చెప్పాడు – ‘మన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఈమధ్య ఒక ఇంటర్వూ్యలో మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్సు ఉంటుందని పొరపాటున అనేశారు సార్..’‘అవును.. ఆయన పాపం పొరపాటున నోరు జారితే దాని మీద యాగీ చేసి మన పార్టీ ఇమేజీని కాస్తా డ్యామేజి చేశారు’ విచారంగా అన్నాడు చంద్రబాబు.‘ఆయన పాపం ఏదో అన్నాడే అనుకోండి.. మన మంత్రులు దాన్ని ఏదో రకంగా కవర్ చేయొచ్చుగా’ అన్నాడు ఎమ్మెల్యే. ‘ఆయన అలా అడ్డంగా దొరికిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు’ అన్నాడు చంద్రబాబు.ఎమ్మెల్యే కిసుక్కున నవ్వాడు. ‘సార్.. నేనే గనక మీ కేబినెట్లో విద్యాశాఖగా మంత్రిగా ఉండి ఉంటే పార్టీకి జరిగిన డ్యామేజిని ఇట్టే పూడ్చేసి ఉండేవాణ్ణి’ అన్నాడు.‘అదెలా?’ ఆసక్తిగా అడిగాడు చంద్రబాబు.ఎమ్మెల్యే విజృంభించాడు. ‘సింపుల్ సార్.. జలీల్ ఖాన్ గారు అన్న మాటే నిజం చేస్తా .. ఇమ్మీడియట్‌గా బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా.. ఆమాటకొస్తే నర్సరీ నుంచి పీజీ దాకా అన్ని క్లాసుల్లో ఫిజిక్సుని సబ్జెక్టుగా పెట్టించేస్తా.. ఆఖరికి మ్యూజిక్ కాలేజీల్లో, వేద పాఠశాలలో కూడా ఫిజిక్సు కంపల్సరీగా చెప్పేటట్టు సిలబస్ తయారు చేయిస్తా.. మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శాస్త్రానికి ఎంత ఇంపార్టెన్సు ఇస్తుందో ప్రపంచానికి చాటి చెబుతా.. ఆ రకంగా ఆ డ్యామేజిని రిపేరు చేసి మన ప్రిస్టేజీని నిలబెడతా ..’ ఆయాసపడుతూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు ఎమ్మెల్యే. చంద్రబాబు కళ్ళు ఆనందంతో చెమర్చాయి. కళ్ళు తుడుచుకుని అన్నాడు.‘బ్రదర్ .. ఇక నువ్వెళ్ళు.. బయట ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన్ని లోపలికి పంపించు..’రెండో ఎమ్మెల్యే లోపలికి గంతులేసుకుంటూ వచ్చాడు. ‘సార్.. మీరేం అడుగుతారో నాకు తెలిసిపోయిందోచ్.. మావాడు కొశ్చెను పేపరు లీక్ చేశాడోచ్..’వెంటనే చంద్రబాబు అందుకున్నాడు. ‘మన ప్రభుత్వంలో ఇది మామూలేనోచ్.. నీ జవాబేదో నువ్వు ఏడువ్వోచ్..’రెండో ఎమ్మెల్యే కూర్చుని స్తిమితపడి అన్నాడు. ‘సార్.. మేలైన జాతి రత్నాల్లాంటి మేధావులతో కిటకిటలాడిపోతున్న మన మంత్రివర్గంలో నాకెందుకు చోటివ్వాలీ అన్నదే కదూ మీ ప్రశ్న? నేను చెప్పేది వింటే మీరు డంగై పోయి ఇప్పటికిప్పుడే ప్రమాణ స్వీకారం చెయ్యమంటారు.. నేను రెడీ అనుకోండి..’‘వెధవ సొద ఆపి పాయింటుకి రా మహాప్రభో..’ విసుగ్గా అన్నాడు చంద్రబాబు.రెండో ఎమ్మెల్యే గొంతు సద్దుకుని ప్రారంభించాడు – ‘సార్.. మన పెద్దాయన, స్పీకర్ కోడెల శివప్రసాదు గారు ఆడవాళ్ల మీద ఏదో ఉపన్యాసం ఇస్తే దాని మీద గొడవైంది కదా సార్..’‘అవునయ్యా.. పెద్దాయన మంచి ఉద్దేశంతోనే ఏదో చెబితే దాన్ని రకరకాలుగా వక్రీకరించారని విన్నాను’ అన్నాడు చంద్రబాబు. ‘పేపర్లలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా రచ్చ రచ్చ అయింది సార్.. అయినా మనకేం పర్వాలేదు సార్.. ఆ సోషల్ మీడియాని ఎంతమంది చూస్తారు లెండి..’‘‘కరెక్టు.. అందుకే నేను దాన్ని‘కంఠ శోషల్ మీడియా’ అంటాను’’ కసిగా అన్నాడు చంద్రబాబు.‘ఏదైనా మన మంత్రులు సరిగ్గా పట్టించుకోలేదు గాని .. అదే నేనే గనక మంత్రినై ఉంటే ఆ పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చేసి .. మన ప్రతిష్ట రెండింతలు పెరిగేలా చేస్తాను సార్..’చంద్రబాబుకి ఇంట్రస్టు కలిగింది. ముందుకి వంగి ‘నువ్వు అతడి కంటె ఘనుడిలా ఉన్నావే.. ఏం చేస్తావో చెప్పు..’ అన్నాడు. బాబు ఆసక్తి చూసి రెండో ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ‘ఆడవాళ్లు వాహనాల్లాంటివాళ్ళనీ, షెడ్డు్డల్లోనే ఉంచితే యాక్సిడెంట్లు అవవని కోడెల గారు అన్నారని కదా ఆ గొడవంతా.. మీరు నన్ను మంత్రిని చేస్తే నేనూ ఆ విషయమే మరోలా చెబుతా .. మనం మన వాహనాల్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టే మహిళల్ని కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం .. వాహనాలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్సు ఉన్నట్టే మహిళలకి కూడా యాక్సిడెంట్ .. అంటే మాన భంగం అనుకోండి .. అలాంటిదేదయినా జరిగితే పరిహారం చెల్లిస్తాం.. వాహనాల బీమాకి ప్రీమియం కట్టాలి గాని ఈ పథకంలో మహిళలు దమ్మిడీ ప్రీమియం కట్టక్కర్లేదు. ప్రభుత్వమే కడుతుంది. ఆడపిల్ల పుట్టినప్పటినుంచే బీమా అమలవుతుంది. ఎటొచ్చీ, వయసు బట్టి పరిహారం రేటు మారుతూ ఉంటుంది. ఆ విధంగా కోడెల గారి మాటని మహిళలకు బంగారు బాటగా మార్చేద్దాం.. ఇంకా చాలా డిటైల్సు వర్కవుట్ చెయ్యాలి సార్.. ప్రమాణ స్వీకారం కాగానే ఆ పనిలోనే ఉంటా..’చంద్రబాబు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.ఎమ్మెల్యే కంటిన్యూ చేశాడు. ‘సార్.. ఈ పథకానికి మంచి పేరు కూడా పెట్టాను సార్..’చంద్రబాబు తేరుకుని ‘ఏమిటది’ అని అడిగాడు.‘భామ–బీమా పథకం’ తడుముకోకుండా చెప్పాడు ఎమ్మెల్యే ’చంద్రబాబు గుండె ఆనందంతో ఉరకలు వేసింది. తన సంతోషాన్ని మొహం మీద కనబడనివ్వకుండా దాచుకుంటూ, ‘ఇక నువ్వెళ్ళు .. మా లోకేష్ మాట్లాడతాడు’ అన్నాడు. ఎమ్మెల్యేలు వెళ్లగానే లోకేష్ లోపలికి వచ్చాడు. లోకేషుని చూస్తూనే అన్నాడు చంద్రబాబు. ‘వీళ్లలో ఇంత టాలెంటు ఉందని నేనెప్పుడూ అనుకోలేదు.. నువ్వెలా పసిగట్టావో కాని లోకేష్ గుంభనగా నవ్వి ‘నాన్నగారూ .. మీకు అసలు విషయం చెప్పమంటారా?’ అన్నాడు.‘ఏమిటా అసలు విషయం?’ అనుమానంగా అడిగాడు చంద్రబాబు.‘వీళ్ళకి ఈ ఆన్సర్లు చెప్పింది నేనే’ కూల్ గా చెప్పాడు లోకేష్. షాక్ తిన్నట్టు చూశాడు చంద్రబాబు. లోకేష్ తాపీగా చెప్పాడు. ‘అవును నాన్నగారూ.. మీరేం అడుగుతారో నాకు తెలుసు .. ఆన్సర్లు రాసిచ్చి రాత్రంతా వీళ్ళకి ట్రయినింగ్ ఇచ్చా.. కావాలంటే ఇదిగో ఆన్సర్ పేపర్లు.. చూడండి..’ కాగితాలు బయటికి తీశాడు. చంద్రబాబు ఆ ఆన్సర్ షీట్లని, లోకేష్‌ని మార్చి మార్చి చూశాడు. ఆ క్షణంలో చంద్రబాబు కళ్ళకి లోకేష్ కురుక్షేత్రంలో కర్తవ్య బోధ చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలా కనిపించాడు.చంద్రబాబు లోకేష్ భుజాలు పట్టుకు ఊపుతూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘నాన్నా, లోకేష్ బాబూ.. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా గాలించాన్రా .. నీలో ఇంత టాలెంట్ ఉందని గ్రహించక వేరే మంత్రుల కోసం వెతికి పెద్ద పొరపాటే చేశాను. ఇప్పటికైనా నా పొరపాటు దిద్దుకోకపోతే చరిత్రకి తీరని ద్రోహం చేసినవాడిని అవుతాను. వెంటనే నిన్నే మంత్రిగా చేసి నీ సత్తా దశదిశలా చాటుతాను’ పూడుకు పోయిన కంఠంతో చెప్పాడు చంద్రబాబు. – మంగు రాజగోపాల్ mangurajagopal@gmail.com -
ఈ ఎమ్మెల్యే బీకామ్‌లో ఫిజిక్స్ చదివారట!
'నవ్విపోదురుగాక నాకేంటి..' అన్నట్లు టీడీపీలో చేరిన ఓ ఎమ్మెల్యే తప్పు మాట్లాడిందేకాక, బహుగా సమర్థించుకున్నారు. 'ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి బీకామ్ డిగ్రీ సాధించా'నంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఖాన్ 'బీకామ్ ఫిజిక్స్' వ్యాఖ్యలపై చాలా మంది పొట్టచక్కలయ్యేలా నవ్వుకుంటుంటే.. కొందరు మాత్రం దీన్నో సీరియస్ అంశంగా చూడాలంటున్నారు. 'పొలిటికల్ సైన్స్‌లో వంటల గురించి బోధిస్తారు'.. అంటూ బిహార్‌కు చెందిన టాప్ ర్యాంకర్ రూబీ రాయ్ సృష్టించిన ఉదంతం గుర్తుందికదా! సరిగ్గా అదే తరహాలో 'ఫిజిక్స్ చదివి బీకామ్ డిగ్రీ పొందా'నంటూ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెప్పుకున్నారు. ఓ న్యూస్ పోర్టల్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. డిసెంబర్ 27న యూట్యూబ్‌లో పోస్ట్ అయిన ఆ వీడియోలో.. చిన్నతనం నుంచే మ్యాథ్స్ జీనియస్‌నని, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో బీకామ్ డిగ్రీ చదివానని ఖాన్ చెప్పుకున్నారు. ఎమ్మెల్యేగారి సమాధానంతో అవాక్కైన రిపోర్టర్.. 'బీకామ్‌లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఎక్కడున్నాయండీ..!' అని ఎదురు ప్రశ్నించినా ఏ మాత్రం తగ్గకుండా తన వాదనను కొనసాగించారు. 'ఏం? బీకామ్‌లో ఫిజిక్స్ లేకపోవడమేంటి? మ్యాథ్స్ కూడా ఉంటుందిగా! కావాలంటే నా సర్టిఫికేట్స్ చూపిస్తా..'అని జలీల్ ఖాన్ తన స్టేట్మెంట్ను సమర్థించుకున్నారు. సదరు న్యూస్ పోర్టల్ ఈ ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం.. జలీల్ ఖాన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. పలు ఇంగ్లిష్, హిందీ వార్తా సంస్థలు ఏపీ ఎమ్మెల్యే చదువుల వ్యవహారంపై వార్తలు ప్రసారం చేశాయి. బిహార్‌కు చెందిన రూబీ రాయ్.. స్కూల్ బోర్డు పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడి, ఫస్ట్ ర్యాంక్ సాధించి, ఓ టీవీ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోవడం, కాపీ కొట్టి మోసానికి పాల్పడినందుకుగానూ ఆమెపై కేసు నమోదుచేసి జైలుకు పంపడాన్ని గుర్తుచేస్తూ ఈ ఏపీ టీడీపీ నేత మాత్రం అందుకు అర్హుడుకాడా? అని ప్రశ్నించాయి. ఫిజిక్స్‌తో బీకామ్.. చదవాలనుకున్నా! సోషల్ మీడియాలో దుమ్మురేపుతోన్న తన ఇంటర్వ్యూ వీడియో గురించి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఓ జాతీయ వార్తా సంస్థకు వివరణ ఇచ్చారు. 'ఆ రిపోర్టర్ చాలా సార్లు బతిమాలడంతో ఇంటర్వ్యూకు ఒప్పుకున్నా. బాగా పొద్దు పోయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే బీకామ్‌లో ఫిజిక్స్ చదివానని మాత్రం నేను అనలేదు. వీడియోను ఎడిట్చేసి అననివి అన్నట్లు చూపించారు. సరే, తప్పో, ఒప్పో, నేను మాట్లాడిన మాటలతో నేను పాపులర్ అయ్యాను. నాకు ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. రాజకీయనాయకుడిగా నాకు అంతకంటే కావాల్సింది ఏముంది?' అని జలీల్ ఖాన్ ఈ వ్యవహారాన్ని తేలికగా కొట్టిపారేశారు . జలీల్‌పై సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న కామెంట్స్ కొన్ని.. -
విలేకరిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దాడి
► ఫోన్ ధ్వంసం..జైల్లో పెట్టిస్తానని బెదిరింపు ► ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ తన రౌడీయిజాన్ని మరోసారి ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి నగరానికి చెందిన ఓ విలేకరిపై భౌతికదాడికి దిగారు. వివరాల్లోకి వెళ్లితే.. తారాపేటలోని జలీల్‌ఖాన్ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో మసీదు, గోరీలదొడ్డి (ముస్లిం శ్మశానవాటిక) చాలా భాగం నష్టపోనుంది. ఈ నేపథ్యంలో గోరీలదొడ్డి కమిటీ, స్థానిక ముస్లిం ప్రముఖులు గోరీలదొడ్డి వద్ద శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. తనకు చెప్పకుండా సమావేశం పెట్టుకోవడమేమిటని జలీల్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడకు చేరుకున్నారు. అందరినీ బూతులు తిట్టడం ప్రారంభించారు. అటుగా వెళ్తున్న ప్రెస్‌క్లబ్ కోశాధికారి, కాకతీయ పత్రిక సంపాదకుడు షఫీ.. గమనించి లోపలకు వెళ్లారు. సెల్ఫోన్లో ఫొటోలు తీయసాగారు. దాంతో జలీల్‌ఖాన్ ఒక్కసారిగా రెచ్చిపోయి ‘ఎవడ్రా ఫోటోలు తీస్తోంది.. వాడిని కుమ్మండ్రా’ అంటూ తన అనుచరులను ఆదేశించారు. జలీల్‌ఖాన్ అనుచరులు షఫీపై దాడికి పాల్పడ్డారు. ఫోన్‌ను ధ్వంసం చేశారు. జలీల్‌ఖాన్‌తో షఫీ మాట్లాడబోగా.. ‘ఎక్కువ మాట్లాడకు.. జైలులో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’ అంటూ చిందులుతొక్కారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ షఫీపై జరిగిన దాడిని జిల్లా మైనార్టీ జర్నలిస్ట్ అసోషియేషన్ తీవ్రంగా ఖండించింది. -
ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై ఫిర్యాదుకు యత్నం
విజయవాడ: అధికార పార్టీని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగడాలు సృష్టిస్తున్నారంటూ ముస్లింలు శనివారమిక్కడ ఆందోళనకు దిగారు. మతతత్వ పార్టీలకు దూరంగా ఉండాలన్న ఫత్వాను జలీల్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయాన్ని శనివారం విజయవాడలో పర్యటిస్తున్న ముస్లిం మతగురువు పీర్ షబ్బీర్ అహ్మద్ కు ఫిర్యాదు చేసేందుకు ముస్లింలు యత్నించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి మత పెద్దలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. -
‘సాక్షి’ జర్నలిస్టులపై ఎమ్మెల్యే దౌర్జన్యం
♦ అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డ ఏపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ♦ విప్ ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపైనా.. సాక్షి, విజయవాడ: విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ‘సాక్షి’ పత్రిక ఫొటో జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్‌పై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దాడికి తెగబడ్డారు. అనుచరులతో కలిసి తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ కెమెరాలు లాక్కొని పిడిగుద్దులు కురిపించారు. చెక్క కుర్చీలు, ఫర్నీచర్‌తో తీవ్రంగా కొట్టి గాయపర్చారు. 2014 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జలీల్‌ఖాన్ ఇటీవలే వైఎస్సార్సీపీని వీడి అధికార టీడీపీలో చేరారు. అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినియమ బిల్లుపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. ఆ విప్‌ను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు అంజిరెడ్డితోపాటు మరో నలుగురు నాయకులు జలీల్‌ఖాన్‌కు ఇవ్వడానికి ఆదివారం మధ్యాహ్నం వెళ్లారు. ఈ న్యూస్‌ను కవర్ చేసేందుకు ‘సాక్షి’ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఐ.సుబ్రహ్మణ్యం, సాక్షి టీవీ కెమెరామెన్ సంతోష్ వ్యాస్లు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకులు విప్‌ను అందజేస్తుండగా జలీల్‌ఖాన్ రెచ్చిపోయారు. అనుచరులతో కలిసి సుబ్రహ్మణ్యం, సంతోష్‌పై దాడి చేశారు. కింద పడేసి కాళ్లతో తన్ని గాయపర్చారు. చెక్క కుర్చీలు, ఫర్నీచర్‌తో కొట్టారు. కెమెరాలను లాక్కొని వాటిలోని ఫొటోలు, వీడియోలను తొలగించి నేలకేసి కొట్టారు. జర్నలిస్టులు అక్కడి నుంచి బయటపడి విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విప్ ఇచ్చేందుకు వెళ్లిన పార్టీ నేతలపైనా దాడి చేశారు. వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన కార్యాలయంలోకి కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ జలీల్‌ఖాన్ కూడా పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు చేశారు. అమానుషం: ఐజేయూ విధి నిర్వహణలో ఉన్న ఫొటో, వీడియో జర్నలిస్టులపై దాడి చేయడం అమానుషమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మండిపడ్డారు. సమాజం మేలు కోసం పనిచేసే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రాజీనామా చేయాలి
కాకినాడ : తమ పార్టీ తరఫున గెలిచి, తెలుగుదేశంలో చేరిన విజయవాడ సిటీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. స్థానిక భాస్కర బిల్డింగ్‌లో మంగళవారం రాత్రి జరిగిన మైనార్టీ సెల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను అడ్డు పెట్టుకుని గెలిచిన జలీల్‌ఖాన్ పార్టీ ఫిరాయించడం తగదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. లేకుంటే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు అక్బర్ అజామ్ మాట్లాడుతూ ముస్లిం ఓట్లతో గెలిచిన జలీల్‌ఖాన్ మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నికల్లో మైనార్టీలకు ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వని పార్టీలో చేరారని విమర్శించారు. స్వార్థం కోసమే ఆయన పార్టీ మారారన్నారు. ఈ సమావేశంలో ముస్లిం ప్రతినిధులు ఎండీ వలీబాషా, ఎండీ లాల్, బాబ్జీ, ఖాజా, రోషన్, అమానుల్లా, ఖలీద్, అబ్దుల్ రహీమ్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాన్ ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు?
విజయవాడ: తమను సంప్రదించకుండా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను టీడీపీలో చేర్చుకోవడంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన నియోజకవర్గంలో టీడీపీ ఫిరాయింపు రాజకీయాలు చేయడాన్ని తప్పుబడుతున్నారు. జలీల్ ఖాన్ ను పార్టీలో ఎలా చేర్చుకున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే జలీల్ ఖాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ టికెట్ పై పోటీ చేయాలన్నారు. జలీల్ ఖాన్ కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. -
టీడీపీలో చేరే ఆలోచన లేదు- జలీల్ ఖాన్
విజయవాడ: టీడీపీలో చేరే ఆలోచన లేదని వైఎస్ఆర్ సీపీ నేత, విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెలిపారు. కేవలం అభివృద్ధి పనుల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్టు ఆయన తెలిపారు. గురువారం ఉదయం మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలిసి జలీల్ ఖాన్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం నగరంలోని గుప్త కల్యాణమండపంలో జరిగిన ముస్లిం మేధావుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. నియోజక వర్గ అభివృద్ది కోసమే ముఖ్యమంత్రిని కలిసానని, అంత మాత్రాన పార్టీలో చేరిపోతున్నట్లు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. చివరి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. -
మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ గరం గరంగా సాగింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా అధికార టీడీపీ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. పంట రుణమాఫీ గురించి మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ మండిపడ్డారు. గందరగోళానికి కారణమై టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ చిన్నమాట అనకపోవడం గమనార్హం.