
మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ గరం గరంగా సాగింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా అధికార టీడీపీ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. పంట రుణమాఫీ గురించి మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు.
దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ మండిపడ్డారు. గందరగోళానికి కారణమై టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ చిన్నమాట అనకపోవడం గమనార్హం.